రాజమౌళితో మహేష్ బాబుకు చెడిందా..? ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఏం జరుగుతుంది? 

First Published | Aug 10, 2024, 6:14 PM IST


మహేష్ బాబు-రాజమౌళి మధ్య సంబంధాలు సవ్యంగానే ఉన్నాయా? వారిద్దరి ప్రవర్తన వింతగా ఉంది. పరిణామాలు చూస్తుంటే ఎస్ఎస్ఎంబి 29 పట్టాలెక్కుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 
 

Rajamouli and Mahesh Babu

మహేష్ బాబు-రాజమౌళి మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మొదటిసారి వీరి కాంబినేషన్ కార్యరూపం దాల్చింది. మరి రాజమౌళి సినిమా అంటే సదర్ హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదవుతాయి. పాన్ ఇండియా హీరో ఇమేజ్ వస్తుంది. అందులోనూ ఈసారి పాన్ వరల్డ్ మూవీ అంటున్నారు. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో జంగిల్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కించనున్నారు. మహేష్ బాబు పాత్ర, క్యారెక్టరైజేషన్ పై రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చేసిన అనధికారిక ప్రకటనలు ఆసక్తిరేపాయి. 

కాగా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 పై వివిధ సందర్భాల్లో మాట్లాడారు. అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు. అంతెందుకు మహేష్ బాబు-రాజమౌళి కలిసిన దాఖలాలు కూడా లేవు. ఇంతవరకు తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్లు మహేష్ బాబు చెప్పలేదు. ఎవరైనా అడిగినా పొడిపొడిగా దాటేశాడు. స్క్రిప్ట్ లాక్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గత మూడు నెలలుగా మహేష్-రాజమౌళి ప్రెస్ మీట్ పెడతారంటూ ప్రచారం జరుగుతుంది. 


విజయేంద్ర ప్రసాద్ అయితే మే లేదా జూన్ లో షూటింగ్ మొదలవుతుంది అన్నారు. కానీ అలాంటి సూచనలు లేవు. ఈ ఏడాది చివరికైనా ఎస్ఎస్ఎమ్బి 29 పట్టాలెక్కుతుందా? అనే సందేహాలు ఉన్నాయి.  ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం కాగా, ఎస్ఎస్ఎంబి 29 నుండి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కనీసం బ్యానర్ ఒక బర్త్ డే విషింగ్ పోస్టర్ వదులుతుందని అభిమానులు అనుకున్నారు. ఎస్ఎస్ఎంబి 29 నిర్మాతలు సైలెంట్ అయ్యారు. 
 

వీటన్నింటికీ మించి మహేష్ బాబుకు రాజమౌళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. టాలీవుడ్ ప్రముఖులు పలువురు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. సాధారణంగా ప్రస్తుతం పని చేస్తున్న హీరోతో దర్శకులు, నిర్మాతలు టచ్ లో ఉంటారు. బర్త్ డే వంటి స్పెషల్ ఈవెంట్స్ మర్చిపోకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ మహేష్ బాబుకి రాజమౌళి చెప్పలేదు. 

ss rajamouli asked nassar to conduct a workshop for actors including mahesh babu for SSMB29

ఈ క్రమంలో రాజమౌళి-మహేష్ బాబు మధ్య సయోధ్య ఉందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఎస్ఎస్ఎంబి 29 పట్టాలెక్కుతుందా అనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ పుకార్లను మహేష్ బాబు ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉండగా, లొకేషన్స్ వేట కూడా మొదలైంది. మహేష్ మరోవైపు మేకోవర్ అవుతున్నాడు. మహేష్-రాజమౌళి మూవీ ఉండదు అనేది అర్థం లేని వాదన అని కొట్టిపారేస్తున్నారు.. 

Latest Videos

click me!