Nidhi Agarwal : అందంతో చంపేస్తున్న ‘నిధి అగర్వాల్’.. లేటెస్ట్ ఫొటోల్లలో కుందనపు బొమ్మలా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 23, 2022, 05:38 PM IST

ఇటీవల విడుదలైన ‘హీరో’ మూవీతో  ప్రేక్షకులను  అలరించిన ‘నిధి అగర్వాల్’, కొత్త కొత్త ఫోట్ షూట్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని లెటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్  చేసింది.   

PREV
16
Nidhi Agarwal : అందంతో చంపేస్తున్న ‘నిధి అగర్వాల్’.. లేటెస్ట్ ఫొటోల్లలో కుందనపు బొమ్మలా..

 ఇస్మార్ట్ శంకర్ మూవీ గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ తన బ్యూటీ తో, చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది. అయితే నిధి అగర్వాల్ తొలుత అక్కినేని హీరో నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటించి టాలీవుడ్ కు  ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అఖిల్ సరసన  మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అనిపించుకుంది. 

26

 తన అభినయం, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నిధి అగర్వాల్, 2017లోనే అప్పటికే డ్యాన్సర్ కావడంతో బాలీవుడ్ లో యంగ్ అండ్ డైనమిక్ హీరో టైగర్ ష్రాఫ్ మూవీ ‘మున్నా మైఖెల్’ మూవీలోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో డ్యాన్సర్ రోల్ లో మెప్పించింది నిధి. 

36

 ఆ సినిమా కోసం బాగా కష్టపడటం,  పైగా టైగర ష్రాఫ్, నసీరుద్దీన్ షా వంటి ఫేమస్ యాక్టర్స్ తో వర్క్ చేయడంతో నిధికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు వరుస కట్టాయి. మున్నా మైఖేల్ మూవీ రిలీజైన వెంటనే ‘సవ్యసాచి’మూవీతో  తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.  

46

 ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను, ఇస్టార్ట్ శంకర్ మూవీల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.  కానీ ఇస్మార్ట్ శంకర్ తో ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో.. రామ్ సరసన నటించిన నిధికి ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది. అప్పటి నుంచి తెలుగుతోపాటు  ఇతర బాషల్లోనూ అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం నిధి తెలుగు, తమిళం మూవీల్లో సినిమాలు చేస్తోంది. 

56

 కోలీవుడ్ లో శింబు, జయం రవి, సినిమాలలో అవకాశాలు అందుకుంది. దాంతో తమిళ నాట ఈ కన్నడ సోయగానికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. తమిళ నాట క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన నిథి అగర్వాల్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయి స్టేటస్ కోసం చూస్తోంది. దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తోంది.

66

 

అయితే ఇటీవల ‘హీరో’ మూవీలో మెరిసన ఈ భామ, సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం కొత్తకొత్త ఫొటోషూల్ లుచేస్తూ తన అభిమానులను, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా కనిపిస్తున్న నిధిపైనే ప్రస్తుతం అందిరి చూపు ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న హరిహరవీరమల్లు  సినిమాలో హీరోయిన్ గా ఆఫర్  కొట్టేయడంతో నిధి ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోబోతుంది.  


 

Read more Photos on
click me!

Recommended Stories