ఏళ్లు గడుస్తున్నా కెమెరా..యాక్షన్ చెప్పని డైరెక్టర్లు .. హిట్టు పడినా కూడా గ్యాప్ ఎందుకు వచ్చింది..?

First Published Jan 23, 2022, 4:12 PM IST

ఒక్క హిట్టు పడితే చాలు డైరెక్టర్ల వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. సక్సెస్ జోష్ లో రెండు మూడు సినిమాల్ని వరుసగా పట్టాలు ఎక్కిస్తారు. కాని టాలివుడ్ లో కొంతమంది డైరెక్టర్లు మాత్రం హిట్టు కొట్టినా సరే.. నెక్ట్స్ సినిమాను ముట్టడం లేదు. హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేస్తుంటే.. డైరక్టర్లు మాత్రం డల్ అయిపోతున్నారు. ఎందుకలాగా..?

కరోనా వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్ల స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి.అంతకు ముందు సినిమా  హిట్టు పడినా కూడా ఇంకో సినిమాను ముట్టుకునే ధైర్యం చేయడంలేదు. స్టార్ డైరెక్టర్లు. అది కరోనా భయమో లేక సినిమా చేసినా.. ఎక్కడ రిలీజ్ చేసుకుంటాము అన్న ఆలోచనో తెలియదు కాని. సినిమాల విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారు చాలా మంది దర్శకులు .

మెగా ఫోన్ పట్టక చాలా కాలం అవుతున్న దర్శకులలో ముందు వరసలో ఉన్నారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally). ఈయన పరిస్థితి కూడా ఇంచుమించూ అలానే ఉంది.  2019లో వచ్చిన మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మరో సినిమా రాలేదు. మహేష్ బాబు మరో సినిమా ఇస్తానని పబ్లిక్ గానే చెప్పడంతో చాలా కాలం వెయిట్ చేశాడు వంశీ. దానితో పాటు రామ్ చరణ్ లాంటి మరికొంత మంది హీరోలను కూడా ట్రై చేశాడు.ఇక  ఇన్నాళ్లకు రీసెంట్ గా  తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) తో సినిమా అనౌన్స్ చేశినా.. అదెప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. సో.. సూపర్ హిట్టు పడినా వంశీ పైడిపల్లి మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నాడు. 

ఇక మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)  కెమెరా.. యాక్షన్ చెప్పక రెండేళ్లు అయిపోతుంది. ఎప్పుడో 2020 సంక్రాంతికి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో అల వైకుంఠాపురంలో మూవీ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచి  త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. అయితే ఎన్టీఆర్(NTR) తో సినిమా అనకుని వెనక్కి తగ్గిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)ను కన్ ఫార్మ్ చేసుకున్నాడు. కాని ఈ ఏడాది ఈ సినిమా కంప్లీట్ అవ్వడం కష్టమనే టాక్ వినిపిస్తుంది. పవర్ స్టార్ భీమ్లా నాయక్ ను తానే దగ్గరుండి చూసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాని మెగా ఫోన్ మాత్రం పట్టలేదు.

ఇక ప్రభాస్(Prabhas) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న యంగ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే ఏకంగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. 2018లో వచ్చిన మహానటితో హిట్టుకొట్టి మంచి పేరు తెచ్చుకున్న నాగ అశ్విన్.. అప్పటి నుంచీ కూడా నాలుగేళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇప్పటిదాకా మరో సినిమా చేయలేదు. ప్రభాస్ తో మూవీ కన్ఫామ్ అయితే చేసుకున్నాడు కాని.. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్  అవ్వాలి.. ఎప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలి..?

2019లో గద్దలకొండ గణేశ్ తో హిట్టు కొట్టిన.. డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar ) కూడా తన నెక్ట్స్ సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి నుంచీ  ప్రయత్నిచగా.. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్ అయ్యింది. అప్పటి నుంచి  ఇప్పటివరకు మరో సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లలేక పోయాడు హరీష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో భవదీయుడు  భగత్ సింగ్ కన్ఫామ్ ఐనా.. ఈమధ్య లో అది పట్టాలెక్కే పరిస్థితి లేదు. అటు గద్దలకొండ గణేశ్ తో హిట్టుకొట్టిన హీరో వరుణ్ తేజ్ మాత్రం గనీ, ఎఫ్ 3 సినిమాలు చేశాడు. రెండూ ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

 సూపర్ సక్సెస్ ఫామ్ లో ఉన్న చాలా మంది దర్శకులు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు.  గతేడాది వకీల్ సాబ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ మరో సినిమా కన్ఫామ్ చేయలేదు.. వకీల్ సాబ్ హీరో పవన్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో ఐకాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు కాని అది కుదరలేదు. కనీసం దిల్ రాజు ఇంకో సినిమా ఇస్తాడేమో అనుకున్నాడు కాని అవేమి కుదరకపోవడంతో వేణూ శ్రీరామ్ ఖాళీగానే ఉంటున్నాడు. ఇలా హిట్టు పడినాసరే చాలామంది టాలీవుడ్  డైరెక్టర్లు ఖాళీగా ఉంటున్నారు. టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు.  

click me!