అది చూపిస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారు.. నిథి అగర్వాల్ బోల్డ్ కామెంట్స్...?

First Published | Oct 19, 2022, 11:05 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే సరిపోదు అంటోందో హీరోయిన్ నిథి అగర్వాల్.  అందం దాచుకుంటే ఇక్కడ నిలబడలేం అంటోంది బ్యూటీ. చూపిస్తేనే ఇక్కడ పనౌతుంది అంటోంది నిథి. ఇంతకీ నిథి అగర్వాల్ అలా ఎందుకు అంది. 
 

టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్లతో నిథి అగర్వాల్ స్పెషల్.  గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనకాడదు హీరోయిన్. హాట్ హాట్ అందాలు వడ్డించడంతో నిథి రూటు సెపరేట్ గా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జోడిగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది బ్యూటి. పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈసినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

 వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు.. ఇక రీసెంట్ గా ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్.. ఎక్స్ పోజింగ్ గురించి మాట్లాడిది బ్యూటీ.   రీసెంట్ గా ఇచ్చిన ఓ  ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడింది.  ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. అందం ఉండాలి.. అది ఉంటే సరిపోతు..  చూపించుకోవాలి అంటూ  బోల్డ్ కామెంట్స్ చేసింది. 
 


Nidhi agarwal hot

 గ్లామర్ షో చేయడానికి  ఏమాత్రం వెనకాడకూడదు అంటోది బ్యూటీ.. అవకాశాలు కావాలి అంటే అంతో ఇంతో చూపించుకోవాలట... అప్పుడే ఎక్కువ  అవకాశాలు వస్తాయి.. హీరోయిన్ గా ముందుకు వెళ్ళగలరంటోంది. ఇది తెలియకనే చాలా మంది లైఫ్ ను మధ్యలోనే ఆపేసుకుని.. ఇబ్బందుల పాలు అవుతున్నారంటోంది బ్యూటీ. 

ముఖ్యంగా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఇస్తారు అంటే అందంగా ఉందా ? లేదా? అన్నది చూసాకే ఆఫర్ ఇస్తారని, కేవలం టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు అంటుంది నిథి. హాట్ ఉండటం మాత్రమే కాదు.. హాట్ నెస్ ను ఉపయోగించాలట. 

2015లో మున్నా మైకేల్ అనే హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది నిథి అగర్వాల్.  టాలీవుడ్ ఎంట్రీలోనే అక్కినేని హీరోలతో వరుసగా రెండు సినిమాలు చేసింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత అఖిల్ అక్కినేని తో మిస్టర్ మజ్ను సినిమాలో కూడా నటించింది. 

ఈ రెండు సినిమాలు నిథికి  ఏమాత్రం కలిసి రాలేదు. అక్కినేని అన్నదమ్ములిద్దరూ కూడా నిధికి  టాలీవుడ్ లో బ్రేక్ ఇవ్వలేకపోయారు. ఇక రామ్ తో  హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మాస్ మసాలా మూవీ  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిథికి బ్రేక్ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. 

కాకపోతే ఇస్మార్ట్ శంకర్ తరువాత నిథికి వరుస హిట్లు.. వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కాని ఇప్పటికీ నిథి కెరీర్ చాలా స్లోగానే సాగుతోంది. పవర్ స్టార్ తో చేస్తున్నహరిహరవీరమల్లు హిట్ పడితే..నిథికి దశ తిరిగిపోయే అవకాశం ఉంది. 

Latest Videos

click me!