`నిక్‌ జోనాస్‌ భార్య` అన్నందుకు చెడుగుడు ఆడుకున్న గ్లోబల్‌ బ్యూటీ.. ఇంకా ఎన్నాళ్లంటూ అసహనం..

Published : Dec 17, 2021, 05:17 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. తన భర్త నిక్‌ జోనాస్‌ భార్య ప్రియాంక చోప్రా అన్నందుకు అగ్గిమీద గుగ్గిలమైంది. ఓ మీడియా సంస్థని పట్టుకుని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఇంకా ఎన్నాళ్లంటూ ఫైర్‌ అయ్యింది ప్రియాంక. దీంతో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. 

PREV
19
`నిక్‌ జోనాస్‌ భార్య` అన్నందుకు చెడుగుడు ఆడుకున్న గ్లోబల్‌ బ్యూటీ.. ఇంకా ఎన్నాళ్లంటూ అసహనం..

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ హీరోయిన్‌ నుంచి గ్లోబల్‌ హీరోయిన్‌గా ఎదిగింది. హాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుని తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు గ్లోబల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది ప్రియాంక చోప్రా. ఆమె హాలీవుడ్‌లో సినిమాలు చేయడమే కాదు, హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ని వివాహం చేసుకుని కూడా గ్లోబల్‌ బ్యూటీగా పిలిపించుకుంటుంది. 

29

మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుంది ప్రియాంక చోప్రా. ఆమె ఎదిగిన తీరే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మామూలు అమ్మాయి నుంచి మోడల్‌గా, అట్నుంచి హీరోయిన్‌గా, స్టార్‌ హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా,ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకుంది.
 

39

అనేక అంతర్జాతీయ వేదికలపై ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారతకు, మీటూ వంటి వాటి గురించి, సమాజంలో మహిళలకు ఎదురవుతున్న అవమానాలు, అసమానతలపై ఆమె గళమెత్తుతుంది. 

49

ఇప్పుడు కూడా అదే చేసింది. తనని తక్కువ చేసిన కథనాలు రాసిన ఓ మీడియా సంస్థకి షాకిచ్చింది ప్రియాంక చోప్రా. ఇంకా ఎన్నాళ్లు అసమానతలు, వివక్ష అనే రేంజ్‌లో మండిపడింది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆ కథనాన్ని పేర్కొంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది ప్రియాంక. 
 

59

`మోస్ట్‌ ఐకానిక్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీకి చెందిన `ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌` చిత్రాన్ని నేను ప్రమోట్‌ చేస్తుంటే.. ఇప్పటికీ నేను 'ది వైఫ్‌ ఆఫ్‌..'గా సూచించబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో దయచేసి వివరణ ఇవ్వమని కోరింది. నేను నా ఐఎండీబీ (IMDB) లింక్‌ని నా బయోకు జోడించాలా ?` అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. 

69

దీనికి ప్రియాంక భర్త నిక్‌ జోనాస్‌ను కూడా ట్యాగ్‌ చేసింది. తాను నటించిన 'ది మ‍్యాట్రిక్స్‌' ఫ్రాంచైజీలోని మూడో చిత్రం 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రియాంక గత కొన్ని రోజులుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 

79

`మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్‌` సినిమాలో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్, నీల్ పాట్రిక్ హారిస్, యాహ్యా అబ్దుల్-మతీన్ 2, జోనాథన్ గ్రోఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 

89

ప్రియాంక తన రాబోయే ప్రాజెక్ట్‌ `సిటాడెల్‌` షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోపాటు ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ఒక బాలీవుడ్‌ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి 'జీ లే జరా' అని  పేరు పెట్టారు. ఇందులో కత్రీనా కైఫ్‌, అలియా భట్‌తో స్క‍్రీన్‌ షేర్‌ చేసుకోనుంది ప్రియాంక చోప్రా. 
 

99

ఆమె ఆగ్రహానికి గురి కావడానికి కారణం.. `నిక్‌ జోనాస్‌ భార్య ప్రియాంక చోప్రా` అని సంభోదిస్తూ రాయడమే. తనకు గుర్తింపు ఇవ్వకుండా, తన భర్త పేరుతో సంభోదిస్తూ, ఓ భార్యగా గుర్తించడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories