ఒక్క ఎపిసోడ్ అయితేనే.. యుద్దం మాత్రం భయంకరంగా జరిగింది. ప్రేరణ - హరితేజ, నిఖిల్- గౌతమ్, యష్మి - గౌతమ్ వీరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. నానా మాటలు అనుకున్నారు. నిఖిల్- గౌతమ్ అయితే బయటకు వెళ్లి తేల్చుకుందాం పదా అంటూ.. గేట్లు తీయ్యాల్సిందిగా కోరారు. అలా ఆవేశంతో ఏదో ఒకటి చేసి... వీకెండ్ లో తిట్లు తినడం అలావాటయ్యింది వీరికి
ఇక నామినేషన్ల వరకూ ఈ వేడి కనిపించినా... ఆతరువాత మాత్రం వీరు నార్మల్ అయ్యి క్లోజ్ గా మాట్లాడుకోవడం కూడా అందరికి తెలిసిందే. అప్పటి వరకే అది కంటీన్యూ అవుతుంటుంది. అయితే యష్మి, నబిల్ లాంటి వారు మాత్రమే పాతవి కూడా క్యారీ చేస్తూ.. తమకు తాము మైనస్ చేసుకుంటుంటారు.