చిరంజీవి ‘విశ్వంభర’కొత్త రిలీజ్ డేట్ ఇదే?

First Published | Oct 14, 2024, 7:52 AM IST

‘గేమ్ ఛేంజర్‌’   సంక్రాంతి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. విశ్వంభ‌ర సినిమా విషయంలో మ‌రో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. 

Chiranjeevi, vishwambara, release date


 మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం  ‘విశ్వంభర’.భోళా శంకర్‌ డిజాస్టర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఓకే చెప్పిన కథ ఇది. అభిమానులు సైతం  చిరంజీవి నుంచి ఒక భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే ఇండస్ట్రీ హిట్‌ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.

మెగాస్టార్‌ లుక్‌తో పాటు టీజర్‌లో కనిపిస్తున్న విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయని అన్ని చోట్ల నుంచి వినిపిస్తోంది. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్‌ ఉందని చెప్తున్నారు. విశ్వంభరతో బాక్సాఫీస్‌ వద్ద మెగాస్టార్ మళ్లీ జెండా పాతుతారని చెప్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానుల నుంచి సామాన్య ప్రేక్షకుల దాకా ఎదురుచూస్తూండటంతో వింతేమీ లేదు.

Chiranjeevi, vishwambara, release date

యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో  విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ గేమ్‌ ఛేంజర్‌ అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి రావడంతో విశ్వంభర వాయిదా పడింది.

ముందుగా గేమ్ ఛేంజర్ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. 
 


Chiranjeevi, vishwambara, release date


దిల్ రాజు మాట్లాడుతూ...'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రం భావించాం.

ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. 

Chiranjeevi, vishwambara, release date


అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్‌ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’ సంక్రాంతి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. విశ్వంభ‌ర సినిమా విషయంలో మ‌రో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు.

విశ్వంభ‌ర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ,  నా కోసం, మా సినిమా కోసం వాళ్ల  మ‌రో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయ‌టానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Chiranjeevi, vishwambara, release date


‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాట‌లు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. త‌ర్వాత టీజ‌ర్‌తో పాటు మరో మూడు సాంగ్స్‌ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి క‌లుద్దాం.' అన్నారు.

VISHWAMBHARA Official Teaser


'విశ్వంభర' సినిమా డైరక్టర్ వశిష్ట మాట్లాడుతూ, "విశ్వంభర చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మొదట్లో ప్లాన్ చేశాం. కానీ అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ చేంజర్' కూడా సంక్రాంతికి విడుదల అవుతుండటంతో,

రెండు పెద్ద చిత్రాలు ఒకే సమయంలో పోటీకి దిగకూడదన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి గారు 'విశ్వంభర' విడుదల తేదీని మార్చాలని నిర్ణయించారు."ఎవరి సినిమా అయినా సరే, రిలీజ్ డేట్ విషయంలో తుది నిర్ణయం చిరంజీవిగారిదే ఉంటుంది. అది రామ్ చరణ్ సినిమా అయినా, వేరే హీరో సినిమా అయినా, మాకు సాంకేతిక పరంగా, మార్కెట్ పరంగా క్లాష్ రాకుండా చూసుకోవడం అవసరం" అని తెలిపారు.

Vishwambhara Teaser

 
 ఈ క్రమంలో ఇప్పుడు విశ్వంభర చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది ట్రేడ్ లో ఆసక్తికరమైన విషయంగా మారింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌  చిత్రాన్ని మే 9, 2025న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.  త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.
 

Latest Videos

click me!