అల్లు అర్జున్ నటించిన తొలి మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య చిత్రం యువతని ఒక ఊపు ఊపేసింది. ఫీల్ మై లవ్ అనే కొత్త పాయింట్ తో సుక్కు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరెకెక్కిన బన్నీ చిత్రం కూడా సూపర్ హిట్. ఈ మూవీ మాస్ ఆడియన్స్ ని మెప్పించింది.