అన్ టామ్డ్
యోసెమిటీ జాతీయ పార్క్‌లో ఓ మహిళ మరణం వెనుక ఉన్న నిజాలను తెలుసుకునే ఫెడరల్ ఏజెంట్ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఎరిక్ బానా, సామ్ నీల్, రోజ్‌మరీ డివిట్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
స్ట్రీమింగ్ తేదీ : జూలై 17
ఆల్మోస్ట్ ఫ్యామిలీ
బ్రెజిల్ తండ్రి, అర్జెంటీనా అల్లుళ్ల మధ్య ఈగో నేపథ్యంలో జరిగే హాస్య కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. లియాండ్రో హస్సుమ్, జూలియా స్వాసిన్నా, గాబ్రియెల్ గోయిటీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
స్ట్రీమింగ్ తేదీ : జూలై 18
పాడింగ్టన్ ఇన్ పెరూ
పెరూ అడవుల్లో మిస్సైన తన తన ఆంటీని వెతికేందుకు పాడింగ్టన్ బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం తెరకెక్కింది.
స్ట్రీమింగ్ తేదీ : జూలై 18