అప్పటికి చిరంజీవి చిన్న హీరో. ఆయనకు దర్శకుడు కే విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం లేదట. మంజు భార్గవి పక్కనే కూర్చున్న చిరంజీవి శంకరాభరణం క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యాడట. కంటి నుండి నీరు ధారగా కారిపోతున్నాయట.
ఎంత కంట్రోల్ చేసినా కన్నీళ్లు ఆగ లేదట. ఇది గమనించిన మంజు భార్గవి తన చీర కొంగు చిరంజీవికి ఇచ్చిందట. ఆమె కొంగు తీసుకుని చిరంజీవి కళ్ళు తుడుచుకుంటుండగా లైట్స్ వేశారట. మంజు భార్గవి చీర కొంగు చిరంజీవి చేతిలో ఉండటం అందరూ చూశారట. ఆ మూవీ ప్రీమియర్ చూడటానికి వచ్చిన ప్రముఖులు అందరు ఆశ్చర్యానికి గురయ్యారట.