డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరుస ఫ్లాపుల తర్వాత మరో క్రేజీ చిత్రానికి రెడీ అవుతున్నారు. డబుల్ ఇస్మార్ట్, లైగర్ లాంటి భారీ ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసే హీరోలు కరువయ్యారు అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ పూరి జగన్నాధ్ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించారు.