బాహుబలితో పాటు సూర్య వదులుకున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఏవో తెలుసా?

మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుంటూ.. మంచి సినిమాలు చేస్తున్నాడు స్టార్ హీరో సూర్య. కమర్షియల్ గా ఆలోచించకుండా ఆర్ట్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దాంతో ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కాస్త తక్కువని చెప్పాలి. ఈక్రమంలో సూర్య  కొన్ని కథలను రిజెక్ట్ చేసి..బ్లాక్ బస్టర్ హిట్స్ ను మిస్ అయ్యాడు. బాహుబలితో సహా సూర్య మిస్ అయిన సినిమాలు ఏవో తెలుసా? 

Suriya  Missed Opportunities Top Blockbuster Movies in telugu jms

Suriya  Missed Blockbuster Movies: వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చినా, కష్టపడి పైకి వచ్చాడు సూర్య.  తండ్రి శివకుమార్ పేరును నిలబెట్టడంతో పాటు.. తనకంటే స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చ చేసుకున్నాడు. సౌత్ సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ గా సూర్యకు పేరుంది. కెరీర్ బిగినింగ్ లోనే వరుస హిట్లు కొట్టిన సూర్య.. తన ఫిల్మ్ జర్నీలో కొన్ని అవకాశాలు వదులుకున్నాడు. సూర్య అలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఆతరువాత బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 

Suriya  Missed Opportunities Top Blockbuster Movies in telugu jms

ఆశ

స్టార్ హీరో సూర్య  1997లో Nerrukku Ner సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వసంత్  సూర్యకు గతంలోనే గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడట.  1995లోనే సూర్యను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు. కానీ సూర్యకు అప్పుడు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో.. ఆమూవీ చేయలేదట.  ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు ఆశ.  ఆ తర్వాత ఆ కథలో అజిత్ నటించాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్  హిట్ అయ్యింది. 


పరుత్తివీరన్

అమీర్ డైరెక్షన్‌లో 2007లో రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమా పరుత్తివీరన్. ఈ సినిమాలో మొదట హీరోగా నటించాల్సింది సూర్యనే. కానీ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేయడానికి సూర్య ఈ సినిమాను త్యాగం చేశారు. కార్తి  ఎంట్రీకి మంచి కథ కోసం చూస్తున్న సూర్య, పరుత్తివీరన్ కథ వినగానే తన తమ్ముడి కోసం బాగుంటుంది అనిపించిందట. దాంతో సూర్య ఈసినిమాను  వదులుకున్నాడట. తర్వాత ఆ సినిమా కార్తీక్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.

తుపాకి

ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో గజిని సినిమాలో నటించిన సూర్య, ఆ తర్వాత ఆయనతో కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలి అనుకున్నారట. ఆసినిమా మరేదో కాదు విజయ్ దళపతి హీరోగా నటించిన  తుపాకి.  కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో సూర్య నటించలేకపోయాడు. ఆ తర్వాత ఆ కథ విజయ్‌కి వెళ్లింది. విజయ్ కెరీర్‌లో తుపాకి ఒక మైలురాయిగా నిలిచింది.

బాహుబలి

సూర్య మిస్ చేసుకున్న సినిమాల్లో బాహుబలి కూడా ఉంది.  రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి కోసం ముందుగా  సూర్యనే అడిగాడట. కాని  ఆ కథకు తాను సరిపోతానా అని డౌట్ వచ్చి, ఈసినిమాను  వద్దన్నాడట సూర్య. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలిగా నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

Latest Videos

vuukle one pixel image
click me!