Devara
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 చిత్రం గతేడాది విడుదలై మంచి విజయం సాధించింది. కథ విషయంలో కాస్త విమర్శలు ఉన్నప్పటికీ గ్రాండ్ విజువల్స్ తో కొరటాల శివ ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు.
ఇటీవల దేవర చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేశారు. డైరెక్టర్ కొరటాల శివతో కలసి ఎన్టీఆర్ అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జపాన్ ఆడియన్స్ నుంచి తారక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ కి గుర్తింపు ఉంది.
ఎన్టీఆర్, కొరటాల ఇద్దరూ జపాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవర పార్ట్ 1 లో మీరు చూసిన కథ కొంత మాత్రమే. అసలైన కథ దేవర 2లో ఉంటుంది. అది ఇంకా భారీగా అద్భుతం ఉంటుంది. దేవర 1లో మీరు దేవర గురించి తెలుసుకున్నారు. కానీ వర గురించి మీకు తెలియదు.. అతడు ఎలాంటోడో పార్ట్ 2లో తెలుస్తుంది. దేవరకి, వరకి మధ్య ఏం జరిగింది అనేది పార్ట్ 2లో కీలకం అని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు దేవర 2పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. తారక్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలు గ్యారెంటీ.