పవన్‌ వాళ్లను రేప్‌ చేయలేదు.. మీలా ఏడుగుర్ని మార్చలేదు: మళ్లీ ఫైర్‌ అయిన మాధవీ లత

తాజాగా  వ్యక్తి మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో ఓ కవితను మాధవీ లతకు పంపగా ఆమె దాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగుతూ ఓ నెటిజెన్‌ కామెంట్‌ చేయటంతో ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యింది మాధవీ లత.

Netizen serious comments on Pawan Kalyan 3 marriages actress Madhavi Latha strong reaction
సినీ నటిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ఎదిగేందుకు కష్టపడుతున్న బ్యూటీ మాధవీ లత. టాలీవుడ్ నాని లాంటి హీరోల సరసన కూడా నటించిన ఈ భామకు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ దక్కలేదు. దీంతో సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం రాజకీయాల్లో తన అదృష్టాన్నీ పరీక్షించుకుంటుంది. పవన్‌ అభిమానిగా ర్యాలీల్లో కూడా పాల్గొన్న మాధవీ లత జనసేన పార్టీలో చేరుతుందని అంతా భావించారు. కానీ ఈ భామ బీజేపీ తీర్థం పుచ్చుకుంది.
అయితే పవన్‌ మీద అభిమానాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తుంది. ఇటీవల పవన్‌ బీజేపీకి మద్దతు తెలపడటంతో `మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్‌ ఇట్‌` అంటూ పవర్‌ స్టార్‌కి బీజేపీకి పొత్తుకు గ్రాండ్‌గా వెల్‌ కం చెప్పింది. అంతేకాదు పవన్‌పై ఎవరైనా విమర్శలు చేసినా తానే వాటికి కౌంటర్‌లు ఇస్తోంది.

ఇటీవల రామ్‌ గోపాల్ వర్మ, పవన్‌ పొలిటికల్‌ కెరీర్‌ మీద సెటైరికల్‌గా పవర్‌ స్టార్ సినిమా తెరకెక్కించిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వర్మ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. పర్సనల్ పగ ఉంటే అతనితో డైరెక్ట్‌గా తేల్చుకో చేతగాని కహానీ ఎందుకు అంటూ ఫైర్‌ అయ్యింది మాధవీ లత.
అయితే మాధవీ లత సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌ అవుతుంటుంది. మాధవీ లత పోస్ట్‌ పెట్టడం, వాటిపై నెటిజెన్లు దారుణమైన ట్రోలింగ్ చేయటం కామన్‌ అయిపోయింది. ఈ ట్రోలింగ్ పై మాధవీ లత కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంటుంది.
తాజాగా వ్యక్తి మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో ఓ కవితను మాధవీ లతకు పంపగా ఆమె దాన్ని తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగుతూ `మూడు పెళ్లిళ్లు చేసుకుని.. నాలుగో ఆమెగా పూనమ్ కౌర్‌తో ఎఫైర్ నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటావు.. నువ్వ ఆడవాళ్ల రక్షణ గురించి మాట్లాడటం.. చాలా వింతగా ఉంది` అంటూ పోస్ట్ చేశాడు.
అయితే అతడి పోస్ట్‌పై మాధవీ లత కూడా ఘాటుగానే స్పందించింది. `అతను వాళ్లను రేప్ చేశాడా?? హింసించాడా?? ఇష్టపడి చేసే అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంది. ఈ సమాజంలో మగాడికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్లకు అంతే హక్కు ఉంది. ఆమెకు నచ్చితే ఏమైనా చేయొచ్చు. ఆమెకు నచ్చకపోతే నేరం. అతను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. డైవర్స్ ఇచ్చిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఆయన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను వాళ్లనేం రేప్ చేయలేదు. మీ వాళ్ల లా ఏడు పెళ్లిళ్లు చేసుకుని మొన్నటి వరకూ తలాక్.. తలాక్.. అని వదిలించుకునే దుర్మార్గపు సాంప్రదాయం ఉన్న మీరు మాట్లాడటం జోక్` రిప్లై ఇచ్చింది మాధవీ లత.

Latest Videos

vuukle one pixel image
click me!