నన్ను అన్ని పనులకు వాడుకొని ఛాన్స్‌ అడిగితే ఛీ పో అన్నాడు: జబర్దస్త్‌ పవన్

First Published | Jul 30, 2020, 1:35 PM IST

సినీ రంగంలో అవకాశం రావటం అంత ఈజీ విషయం కాదు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, చీత్కారాలు చూడాలి. అప్పుడే అవకాశం దొరుకుతుంది. అలా దొరికిన వాళ్లు తమని తాము ప్రూవ్ చేసుకోగలిగితే నిలబడతారు, లేదా కనుమరుగవుతారు. కానీ అసలు అవకాశమే రాని వాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాలు రాక, తిరిగి వెళ్లలేక ఇక్కడే ఏదో ఓ పని చేస్తూ బతికేస్తుంటారు. అలాంటి కథే జబర్థస్త్ పవన్‌ది.

అందరిలాగే పవన్‌ కూడా తానేంటో వెండితెర మీద ప్రూవ్‌ చేసుకోవాలని వేల ఆశలతో హైదరబాద్‌ వచ్చాడు. తొలినాళ్లలో చాలా కష్టాలు పడ్డాడు. ఒక్క ఛాన్స్‌ అంటూ ఎంతో మందిని అడిగాడు. చివరకు తాను ఆశించిన స్థాయి అందకపోవటంతో ఆడ వేషాలతో జబర్దస్త్‌లో ఆకట్టుకొని పాపులర్‌ అయ్యాడు. ఈ విషయాలన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు పవన్‌.
హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న పవన్‌కు పూట గడవటమే కష్టంగా ఉండేదట, అందుకే గురువారం బాబా గుడిలో పెట్టే ప్రసాదం కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయని తన బాధను పంచుకున్నాడు. అక్కడే ఓ చిన్నగదిలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నం చేసేశాడు.

ఇండస్ట్రీలో కూలీగా, మేకప్‌ అసిస్టెంట్‌గా పనిచేయటమే కాదు, ఒక దశలో మేస్త్రీగా కూడా పనికి వెళ్లానని చెప్పాడు. ఆ సమయంలో లేడీ గెటప్‌ అవకాశాలు రావటంతో ఒప్పుకున్నాడు. కానీ ఆ క్యారెక్టర్లు చేస్తున్నందుకు అంతా అవమానకరంగా మాట్లాడుతుంటే ఒక్కోసారి చనిపోవాలని కూడా అనిపించేందని తన ఆవేదనను చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా చేరటంతో అమ్మా రాజశేఖర్‌తో పరిచయం అయి ఆయన దగ్గర పనికి చేరాడు. ఆయన నటుడిగా అవకాశం ఇస్తానని చెప్పడంతో అమ్మా రాజశేఖర్ వ్యక్తిగత పనులు కూడా చేసి పెట్టేవాడట, బట్టలు ఉతకటం, కాళ్లు పట్టడం లాంటి పనులు కూడా చేసేవాడట. అమ్మ రాజశేఖర్‌ని భార్య కంటే ఎక్కువగా చూసుకున్నానని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు పవన్‌.
అయితే ఖతర్నాక్ సినిమా సమయంలో అవకాశం ఇస్తానని చెప్పి తరువాత నువ్‌ సినిమాల్లో చేస్తావా..? నీ ఫేస్‌ చూసుకున్నావా..? అంటూ అవమానించాడని, అయినా భరిస్తూ అవకాశం కోసం అతని దగ్గర పనిచేశానని కానీ తరువాత టక్కరి సినిమాకు కూడా అవకాశం ఇవ్వకపోవటంతో అమ్మ రాజశేఖర్ దగ్గర నుంచి బయటకు వచ్చేశానని చెప్పాడు.
తరువాత కొద్ది రోజులు ఢీ షోలో అసిస్టెంట్‌గా పనిచేసిన తరువాత జబర్థస్త్ అవకాశం రావటంతో పవన్‌ లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం జబర్థస్త్ షోతో పాటు పలు వీడియో ఆల్బమ్స్‌లోనూ నటిస్తున్నాడు పవన్‌.

Latest Videos

click me!