Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా

Published : Sep 16, 2026, 11:20 AM IST

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజైన సినిమాల్లో ఏవి ఎక్కువ వ్యూస్ రాబట్టాయో, టాప్ 10 లిస్ట్‌లో ఏయే సినిమాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ నటించిన క్రేజీ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్నాయి.

PREV
15
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 లిస్ట్

సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్ట్ వచ్చేసింది. ఇందులో నాలుగు క్రేజీ సినిమాలు సత్తా చాటాయి. 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'జీడీఎన్', 'ప్యార్ ప్రేమ కల్యాణం', 'గట్టా కుస్తీ 2' ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. అవే ఏయే స్థానాల్లో ఉన్నాయో చూద్దాం.

25
ఫస్ట్ ప్లేస్‌లో సూర్య సినిమా

హీరో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. పోయిన వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ, కేవలం మూడు రోజుల్లోనే 55 లక్షల వ్యూస్ రాబట్టింది. అజయ్ దేవగణ్ హిందీ సినిమా 'ధమాల్ 4' 29 లక్షల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక మాధవన్ హీరోగా నటించిన తమిళ్ మూవీ 'జీడీఎన్' 22 లక్షల వ్యూస్‌తో మూడో ప్లేస్ దక్కించుకుంది.

35
తాప్సి సినిమా హవా

తాప్సీ నటించిన హిందీ సినిమా 'గాంధారి' నాలుగో స్థానంలో నిలిచింది. 'ఆల్ఫా' ఆరో స్థానంలో, 'న్యూటన్స్ థర్డ్ లా' ఏడో స్థానంలో నిలిచాయి. ఎనిమిదో ప్లేస్‌ను 'కాక్‌టెయిల్ 2' దక్కించుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో మళ్లీ తమిళ్ సినిమాలే ఉన్నాయి.

45
కొరియన్ కనకరాజు దూకుడు

థియేటర్స్ లో విజయం సాధించిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా రచ్చ చేస్తోంది. చాలా ఏళ్ళ తర్వాత వరుణ్ తేజ్ కి దక్కి క్లీన్ హిట్ ఇది. హారర్ యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన కొరియన్ కనకరాజుమూవీ ఓటీటీలో ఆడియన్స్ ని ఫిదా చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో కొరియన్ కనకరాజు చిత్రం 12 లక్షల వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

55
గట్టా కుస్తీ 2 క్రేజ్ తగ్గలే

డైరెక్టర్ ఇలన్ హీరోగా నటించిన 'ప్యార్ ప్రేమ కల్యాణం' ఈ వారం తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ మూవీ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజైంది. ఇక పదో ప్లేస్‌లో విష్ణు విశాల్ 'గట్టా కుస్తీ 2' ఉంది. ఓటీటీలోకి వచ్చి నెల దాటుతున్నా, జనాల్లో ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ లిస్ట్ చూస్తే అర్థమవుతోంది. చెల్లా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories