#Kalki2898AD:'కల్కి' రైట్స్ కోసం ఆ OTT సంస్దల మధ్య యుద్దం? ఎంత కోట్ చేస్తున్నారంటే..

First Published Mar 26, 2024, 6:21 AM IST

ఈ చిత్రం ఓటిటి రైట్స్ కోసం ఓ రేంజిలో డిమాండ్ క్రియేట్ అయ్యింది.  ఈ రైట్స్ రేటు ను ఈ రెండు సంస్దలు పెంచుకుంటూ పోతున్నాయని తెలుస్తోంది.

Kalki OTT rights


క్రేజ్ ఉన్న సినిమా ఓటిటి రైట్స్ తమ దగ్గర ఉండాలని ప్రతీ  ఓటీటి సంస్దకు ఉంటుంది. అందుకోసం ఎంత పెద్ద మొత్తమైనా వెచ్చించటానికి రెడీ అవుతూంటాయి. అందులోనూ ఓటిటి సంస్దల మధ్య పోటీ విపరీతంగా ఉన్న ఈ పరిస్దితుల్లో ఏ అవకాసం మిస్ చేసుకోదలుచుకోవటంలేదు ఈ సంస్దలు. సినిమా ప్రారంభం నుంచి ఆ నిర్మాతల చుట్టూ తిరుగుతూ ప్రదక్షణాలు చేస్తున్నారు నిర్మాతలు. అలాగే ఇప్పుడు ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం  'కల్కి' రైట్స్ కోసం రెండు OTT సంస్దల మధ్య యుద్దం మొదలైందని సమాచారం. ఏమిటా ఓటిటి సంస్దలు ..వివరాల్లోకి వెళితే...

Prabhas Kalki 2898 AD film


ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K). ఈ సినిమాలో ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడో అంటూ... సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  సూపర్‌ హీరోలా డిజైన్‌ చేసిన ప్రభాస్‌ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ సందడి చేయనున్నారు. 

Prabhas Kalki 2898 AD film updates out


మహా శివరాత్రి సందర్భంగా ఇందులో ఆయన లుక్‌ని విడుదల చేశారు. భవిష్యత్తు కాశీ నగరం వీధుల్లో ఉన్న భైరవగా ప్రభాస్‌ని పరిచయం చేసింది చిత్రబృందం. ఆధునిక అవతారంలో ప్రభాస్‌ కనిపించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. 

Kalki 2898 AD

 ఈ చిత్రం ఓటిటి రైట్స్ కోసం ఓ రేంజిలో డిమాండ్ క్రియేట్ అయ్యింది.  Netflix, Prime Video వారు ఈ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎంత రేటు అయినా పెట్టడానికి సై అంటున్నారు. వేలం పాటలాగ ఈ రైట్స్ రేటు ను ఈ రెండు సంస్దలు పెంచుకుంటూ పోతున్నాయని తెలుస్తోంది. అయితే నిర్మాతలు కూడా ఈ రైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని, అన్ని రకాలుగా చూసుకునే డీల్ క్లోజ్ చేయబోతున్నారట.


ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్ 200 కోట్లు దాకా పలుకుతున్నాయని , డిజిటల్ మార్కెట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ కాబోతోందని చెప్తున్నారు. ఈ రైట్స్ విషయంలో అశ్వనీదత్ ...బడ్జెట్ ని బేరేజు చేసుకుని దిగుతున్నారట. అలాగే ఈ రైట్స్ లో కొంత భాగం రెమ్యునరేషన్ గా ప్రభాస్ కు వెళ్లనుందిట. అందుకే ఈ రెండు ఓటిటి సంస్దలలో ఏది ఎక్కువ కోట్ చేస్తే అటు ఎగ్రిమెంట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.  గ్లోబుల్ మార్కెట్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ కానుంది. 


నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 


ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. మరో ప్రక్క ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపిస్తారనే (Prabhas Plays Lord Vishnu)వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది.


 ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’.ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  

click me!