ఇదిలా ఉంటే చిరుత సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ను పలకరించిన ఈ అందాల తార బీహార్‌లోని భాగల్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ శర్మ కూతురు. వృత్తిలో నటి, మోడల్. ప్రస్తుతం నేహా ముంబైలో తన సోదరి ఆయేషా శర్మతో కలిసి ఉంటోంది. నేహా కెరీర్ విషయానికొస్తే 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2010లో వచ్చిన క్రూక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నేహా క్యా సూపర్‌కూల్ హైం హమ్, యమ్లా పగ్లా దీవానా 2, యంగ్‌స్తాన్, ముబారకన్, తానాజీ లాంటి సినిమాల్లో కనిపించింది.