చెప్పు తెగుద్ది.. రమ్మంటూ సైగ చేసిన జబర్దస్త్ కమెడియన్‌కి యాంకర్‌ రష్మి మాస్‌ వార్నింగ్‌

Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షోలో ఓ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. యాంకర్‌ రష్మిని రమ్మంటూ పిలిచిన జబర్దస్త్ కమెడియన్‌కి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది రష్మి. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. 
 

rashmi gautam, bullet bhaskar

Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షో దాదాపు 12ఏళ్లుగా తెలుగు ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతుంది. వారానికి రెండు రోజులు నవ్వులు పూయిస్తుంది. ఇందులో ఆల్మోస్ట్ ప్రారంభం నుంచి యాంకర్‌గా రాణిస్తుంది రష్మి గౌతమ్‌.

ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్‌కి రష్మి వార్నింగ్‌ ఇచ్చింది. షోలోనే అందరి ముందు చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించడం వైరల్‌గా మారింది. 

jabardasth varsha, bullet bhaskar

యాంకర్‌ రష్మి.. జబర్దస్త్ షోకి యాంకరింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లెట్‌ భాస్కర్‌, జబర్దస్త్ వర్ష కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్నారట. తమ పెళ్లికి జడ్జ్ లు ఖుష్బూ, శివాజీ వచ్చారు, కానీ రష్మి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్ష.

దీనికి భాస్కర్‌ రియాక్ట్ అవుతూ, మార్చి 1న మన పెళ్లి ఆ రోజు పెన్షన్‌ వచ్చే రోజు, కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్లి ఉంటుంది అని తెలిపారు. దెబ్బకి రష్మి మొహం మాడిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా మీరు పెన్షన్‌ మిస్‌ అయ్యారా అంటూ పంచ్‌ వేసింది. 
 


rashmi gautam

ఆ తర్వాత జబర్దస్త్ వర్ష వెళ్లిపోయింది. భాస్కర్‌ ఒక్కడే ఉన్నాడు. రష్మి వైపు చూస్తూ సైగలు చేశారు. రమ్మంటూ ఆమెని సైగల్‌ చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్‌ అయ్యారు. మరో ఆలోచన లేకుండా ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా రష్మి సైతం స్పందించింది. చెప్పు తెగుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్‌ ఇచ్చింది. 
 

bullet bhaskar

అసలు నీకు సిగ్గు ఉందా? మీ ఇంట్లో అక్కా చెల్లెళ్లు లేరా? అంటూ నిలదీసింది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదనేలా ఆమె గట్టిగానే హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా షో సీరియస్‌గా మారింది.

దీంతో బుల్లెట్‌ భాస్కర్‌ మాట మార్చేశాడు. దాన్ని పాజిటివ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అక్కా చెల్లెళ్లు ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నామని కవర్‌ చేసుకున్నాడు. దెబ్బకి రష్మి నవ్వులు పూయించింది. 
 

rashmi gautam

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలోని సన్నివేశం ఇది. బుల్లెట్‌ భాస్కర్‌, వర్ష కలిసి ఈ స్కిట్‌ చేశారు. అందులో భాగంగా రష్మిపై సెటైర్లు వేశారు. ఫన్‌ కోసం ఇలా కామెడీగా చేశారు. ఈ ప్రోమోలో ఈ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ జబర్దస్త్ షో ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో ఈటీవీలో ప్రసారం కానుంది. 

read  more: సూపర్ స్టార్ కృష్ణపై నాగార్జున సెటైర్ ? ఆయన అట్టర్ ఫ్లాప్ మూవీని ఎత్తి చూపి ఏమన్నారో తెలుసా..
also read: ఇంజనీర్‌ కావాల్సిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, హీరో ఎలా అయ్యాడో తెలుసా? జీవితాన్నే మార్చేసిన కాలేజ్‌ సంఘటన

Latest Videos

click me!