పాపం విశాల్.. నెగిటివ్ పబ్లిసిటీ నిండా ముంచేసింది

First Published Dec 23, 2022, 3:17 PM IST

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.  అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు.

Vishal

హీరో విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. తెలుగులో కూడా అంతే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విశాల్ ని టాలీవుడ్ ఫ్యాన్స్ తెలుగు హీరోలాగే భావిస్తారు.  అయితే కెరీర్ ఆరంభంలో ఉన్న జోరు విశాల్ ఇప్పుడు ప్రదర్శించలేకున్నాడు. విశాల్ నటిస్తున్న చిత్రాలు మెప్పిస్తున్నాయి కానీ బిగ్ హిట్ కావడం లేదు. విశాల్ ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు చేస్తున్నాడు.  

విశాల్ లేటెస్ట్ మూవీ 'లాఠీ' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి షో నుంచే లాఠీ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. విశాల్ చిత్రాలు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వసూళ్లు వస్తాయి. విశాల్ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదు. తొలిరోజు డిజాస్టర్ రేంజ్ లో లాఠీ చిత్రానికి పూర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 65 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. 

దీనికి కారణం నెగిటివ్ పబ్లిసిటీనే అని అంటున్నారు విశ్లేషకులు. విశాల్ గురించి గత కొన్ని రోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగుతోంది. విశాల్ కుప్పంలో వైసిపి నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పాలిటిక్స్ విశాల్ కి బాగా పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. కానీ అతడి సినిమా విషయంలో అది నెగిటివ్ గా మారింది. 

ఇక లాఠీ  ప్రచార కార్యక్రమాల్లో విశాల్ తన ఓటు జగన్ కే అని చెప్పడం.. సినిమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అని ద్వంద్వ వైఖరితో మాట్లాడడంతో విశాల్ పై ట్రోలింగ్ బాగా పెరిగింది. దీనితో చాలా మంది టిటిడి, జనసేన మద్దతుదారులు లాఠీ చిత్రాన్ని చూసేందుకు ఇష్టపడలేదు. ఫలితంగా లాఠీ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద దారుణమైన నంబర్స్ నమోదు చేసుకుంది. 

వచ్చామా.. ప్రమోషన్స్ చేసుకున్నామా వెళ్ళామా అన్నట్లు ఉండక.. పాలిటిక్స్ తో పబ్లిసిటీ పొందాలనుకుంటే అది నెగిటివ్ గా మారి బూమరాంగ్ అవుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఎదురైంది. 

ఆ చిత్ర దర్శకుడు శేఖర్ తాను రాజశేఖర్ రెడ్డి అభిమానిని అని చెప్పుకోవడంతో అతడి పాత  బయటకి వచ్చి పెద్ద రచ్చే జరిగింది. నితిన్ సినిమాపై నెగిటివ్ ప్రభావం చూపింది. 

click me!