తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు సత్యనారాయణగారి మృతి తనను కలచి వేస్తోందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. కైకాలకునివాళి అర్పిస్తూ.. ఆయన ట్విట్టర్ లో ఓ నోట్ రిలీజ్ చేశారు. అంతే కాదు స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకింత భావోద్వేగానికిలోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. కైకాల ఆయన పోషించినటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను భారతదేశంలో మరెవరూ పోషించి ఉండరని చెప్పారు. ఆయనతో కలిసి తాను ఎన్నో చిత్రాలలో నటించానని, ఆ సందర్భంగా ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు కలిగిందని అన్నారు.