భర్తని కౌగిలిలో బంధించి పరవశించిపోతున్న స్నేహ.. పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హోమ్లీ బ్యూటీ అందాలు

Published : Dec 23, 2022, 02:42 PM ISTUpdated : Dec 23, 2022, 03:09 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహ గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె తన భర్తతో దిగిన ఫోటోలను షేర్‌ చేయగా అవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.   

PREV
18
భర్తని కౌగిలిలో బంధించి పరవశించిపోతున్న స్నేహ.. పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న హోమ్లీ బ్యూటీ అందాలు

స్నేహ(Sneha) లేటెస్ట్ గా సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. జబ్బలపై గౌన్‌ జారిపోతుండగా, టాప్‌ అందాలతో దోబూచులాడుతుంది. పరువాల విందు చేస్తూ ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది. 
 

28

అంతేకాదు తన భర్త, నటుడు ప్రసన్న(Prasanna)తో కలిసి ఆమె ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఇద్దరూ కలిసి ఫోటో షూట్‌ చేశారు. ఇందులో తన కౌగిలిలో భర్తని బంధించి, మరోవైపు తన భర్త కౌగిలిలో ఒదిగిపోతూ స్నేహ ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

38

ఈ సందర్బంగా తన భర్తని ఉద్దేశించి స్నేహ పోస్ట్ పెట్టింది. `మీరు పరిపూర్ణంగా ఉన్నారని నేను చూశా. దీంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు పరిపూర్ణులు కాదని నేను చూసినా నేను మరింతగా ప్రేమిస్తా` అని తెలిపింది. ప్రస్తుతం స్నేహ పెట్టిన పోస్ట్, ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

48

ఇది చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బెస్ట్ కపుల్‌ అని, క్యాప్షన్‌కి అందని జంట అని, ఫైరింగ్‌ జోడీ అంటున్నారు. పర్‌ఫెక్ట్ కపుల్‌ అని, ఇద్దరూ గార్జియస్‌గా ఉన్నారని అంటున్నారు. 
 

58

స్నేహ, ప్రసన్న 2012 మే 11న పెళ్లి చేసుకున్నారు. పదేళ్లు విజయవంతంగా పూర్తి చేశారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇటీవల వీరిద్దరు దూరంగా ఉంటున్నారు, విడిపోతున్నారనే పూకార్లు ఊపందుకున్నాయి. ఈనేపథ్యంలో కలిసి ఉన్న ఓ ఫోటో షేర్‌ చేసి ఆ గాసిప్ లకు చెక్‌ పెట్టారు. దాన్ని ఇప్పుడీ ఫోటో షూట్‌తో మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేశారు.
 

68

హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న స్నేహ మాగ్జిమం ట్రెడిషనల్‌ లుక్‌ లోనే మెరుస్తూ ఆకట్టుకుంది. అలాంటి పాత్రలే చేసింది. తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో చోటు సంపాదించింది. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. ఒకటి అర హిస్టారికల్‌ పాత్రలు, మైథాలజీ సినిమాల్లో తప్ప ఆమె ఏనాడూ హద్దులు చెరపలేదు. అందుకే ఆమె ప్రత్యేకంగా నిలిచింది. 
 

78

స్నేహ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ రాణించాలనుకుంటుంది. ఇప్పటికే `సన్నాప్‌ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించింది. అయితే ఆమె ఆచితూచి సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఇప్పుడు వరుసగా ఫోటో షూట్లతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

88

హోమ్లీ బ్యూటీ స్నేహ గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె తన భర్తతో దిగిన ఫోటోలను షేర్‌ చేయగా అవి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories