చూపులతోనే మత్తెక్కిస్తున్న `ఓజీ ` బ్యూటీ.. వైట్‌ షర్ట్‌ ధరించి ఫారెస్ట్ లో ప్రియాంక మోహన్‌ కిల్లింగ్‌ పోజులు

Published : Apr 25, 2023, 10:58 PM ISTUpdated : Apr 26, 2023, 03:21 PM IST

ప్రియాంక అరుల్‌ మోహన్‌ క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటోంది. నానితో కలిసి నటించి మెప్పించిన ఈ భామ ఇప్పుడు పవన్‌తో జోడీ కట్టబోతుంది. దీంతో తరచూ ఈ బ్యూటీ హాట్‌ టాపిక్ అవుతుంది.   

PREV
17
చూపులతోనే మత్తెక్కిస్తున్న `ఓజీ ` బ్యూటీ.. వైట్‌ షర్ట్‌ ధరించి ఫారెస్ట్ లో ప్రియాంక మోహన్‌ కిల్లింగ్‌ పోజులు

పవన్‌ ఫ్యాన్స్ ఏం రేంజ్‌లో హంగామా చేస్తారో తెలిసిందే. పవన్‌తో చేయబోయే నటీనటులను ఓ రేంజ్‌లో పాపులర్‌ చేస్తారు. వారిని ట్రెండ్‌ చేస్తుంటారు. తాజాగా క్యూట్‌ బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ బ్యూటీ తాజాగా తన గ్లామర్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోవడమే. 

27

వైట్‌ షర్ట్ ధరించి ఆమె ఫారెస్ట్ ఏరియాలో ఫోటో షూట్‌ చేసింది. డిఫరెంట్‌ పోజులతో ఆకట్టుకుంది. క్యూట్‌గా, హాట్‌గా, సెక్సీగా, కొంటెగా, విరహంతో ఇలా విభిన్న యాంగిల్స్ లో ఆమె ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది. ఇందులో ప్రియాంక టూ క్యూట్‌గా, హాట్‌గా ఉంది. మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె ఇచ్చిన పోజులు మాత్రం మతిపోయేలా ఉన్నాయి. 
 

37

దీంతో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇది చూసిన పవన్‌ ఫ్యాన్స్ ఈ అమ్మడిని మరింత ట్రెండ్‌ చేస్తూ వైరల్‌ గా మారుస్తున్నారు. ఓజీ హీరోయిన్‌ అంటూ, ఓజీ బ్యూటీ అని, ఓజీ గర్ల్ కిర్రాక్‌ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓజీ గర్ల్ వచ్చింది, మిగిలినవారంతా పక్కకెళ్లండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

47

ప్రియాంక మోహన్‌.. పవన్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన విసయం తెలిసిందే. సుజీత్‌ రూపొందించే `ఓజీ` చిత్రంలో పవన్‌ సరసన ప్రియాంక కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటున్నారు. ప్రియాంక ఎప్పుడు జాయిన్‌ అవుతుందో తెలియాల్సి ఉంది. 
 

57

ఇదిలా ఉంటే పవన్ తో ప్రియాంక సినిమా చేస్తుండటంతో, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడికి ఫాలోవర్స్ గా, అభిమానులుగా మారుతున్నారు. దీంతో ఈ బ్యూటీ ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారు. `ఓజీ`గర్ల్ కి అభిమానులుగా మారి ఫుల్‌ క్రేజ్‌ని తీసుకొస్తున్నారు. అందుకే ఈ బ్యూటీ ఏం చేసినా చర్చనీయాంశం అవుతుంది. వైరల్‌ అవుతుంది. ఇప్పుడు గ్లామర్‌ ఫోటోలు కూడా అందులో భాగమే. 
 

67

ప్రియాంక అరుల్‌ మోహన్‌.. నానితో `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడకి చెందిన ఈ భామ కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, టాలీవుడ్‌ని పలకరించి ఇప్పుడు కోలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. నెమ్మదిగా తెలుగులో అవకాశాలను అందుకుంటుంది. `గ్యాంగ్‌ లీడర్‌` తర్వాత `శ్రీకారం` చిత్రంలో నటించింది ప్రియాంక. ఇది కూడా పరాజయం చెందింది. 

77

దీంతో తెలుగు మేకర్స్, ఆడియెన్స్ ఈ బ్యూటీని పట్టించుకోలేదు. ఇప్పుడు సుజీత్‌ ఈ బ్యూటీని మళ్లీ తెలుగులోకి తీసుకురావడం విశేషం. దీంతోపాటు ప్రస్తుతం తమిళంలో `కెప్టెన్‌ మిల్లర్‌`తోపాటు మరో కోలీవుడ్‌ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories