మా కోడలు బంగారం... నయనతారపై విగ్నేష్ తల్లి ప్రశంసలు!

Published : Nov 25, 2022, 03:05 PM IST

కొత్త కోడలు నయనతారపై అత్తయ్య ప్రశంసలు కురిపిస్తున్నారు. నయనతార పనితనానికి మురిసిపోతున్న విగ్నేష్ తల్లి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నయనతార అత్తయ్య లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
15
మా కోడలు బంగారం... నయనతారపై విగ్నేష్ తల్లి ప్రశంసలు!
Nayanathara


మంచి కోడలు దొరకడం కంటే అత్తకు అదృష్టం ఏముంటుంది. అన్ని విధాలాఅనుకూలవతి కోడలిగా వచ్చినట్లు విగ్నేష్ తల్లి మురిసిపోతున్నారు. నయనతార గురించి ఆమె అత్తగారు మీనా కుమారి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

25

మా అబ్బాయి సక్సెస్ ఫుల్ డైరెక్టర్, కోడలు స్టార్ హీరోయిన్. ఇద్దరూ చాలా కష్టపడే తత్త్వంగలవారు. అలాగే నయనతార చాలా దయా హృదయం కలిగిన అమ్మాయి. ఇంట్లో 8మంది వర్కర్స్ పనిచేస్తారు. వారిలో ఒకరు రూ. 4 లక్షల అప్పు తీర్చలేక ఇబ్బంది పడ్తున్న విషయం తెలిసి నయనతార... ఆ అప్పు తీర్చిందని, చెప్పుకొచ్చారు. 
 

35

నయనతారకు ఇల్లును చక్కబెట్టడం, పెద్దవారి ఆలనా పాలనా, క్షేమం చూసుకోవడం బాగా తెలుసు. 10 మంది మనుషులు చేసే పని నయనతార ఒక్కతే చేస్తుంది. మేము మా పిల్లలకు కష్టపడటం నేర్పాము. నయనతార కూడా అలాగే కష్టపడటం తెలిసిన అమ్మాయి. నయనతార, విగ్నేష్ వారి వృత్తిని గౌరవిస్తారు. అందులో ఉన్నత స్థానం చేరుకునేందుకు కృషి చేస్తారు, అని విగ్నేష్ తల్లిగారు మీడియాకు తెలియజేశారు 
 

45
Nayanathara

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్నారు. మహాబలేశ్వరంలో ఘనంగా వీరి వివాహం జరిగింది. సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యామంటూ ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో వివాదాస్పదమైంది. తమిళనాడు ప్రభుత్వం సరోగసీ నిబంధనలు పాటించారా లేదా? అనే విషయంపై విచారణ చేపట్టింది. 
 

55

అయితే ఐదేళ్ల క్రితమే తమకు పెళ్లయిందని, సరోగసి నిబంధనలు ఉల్లంఘించలేదని నయనతార దంపతులు ఆధారాలు సమర్పించారు. దీంతో వారు వివాదం నుండి బయటపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ మూవీ జవాన్ తో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories