విశ్లేషణ : ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రోటీన్ స్టోరీ. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కొత్తదనమేమీ లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పొలిటీషన్స్, ప్రభుత్వ ఆఫీసర్లకు ప్రజలు గుర్తుకు వస్తారని.. ఆ తర్వాత పట్టించుకునే నాథుడే ఉండడనేది మెయిన్ ప్లాట్ గా అర్థం అవుతోంది. సినిమా మొత్తం ఈ అంశంపైనే నడుస్తుంది. కథ సాగిన తీరుకూడా పెద్దగా ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. ఒకసన్నివేశం చూస్తే ఆ తర్వాతి వచ్చే సీన్లను ఈజీగానే ఊహించే విధంగా ఉంది. మరీ ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే సినిమా అంతంఎలా ఉంటుందో చెప్పేయోచ్చు. పేదలు వైద్యం కోసం వాగులు, వంకలు దాటుకొని పోవాల్సి వచ్చిన సన్నివేశాలను నిత్యం మనం న్యూస్ లోచూసేలానే ఉన్నాయి. వీటిని కొత్తగా చూపించే ప్రయత్నమూ చేయలేదు. గిరిజనుల సమస్యలకు సంబంధించి ఎమోషన్స్ పండలేదు. దీంతో ఆయ సీన్లు తేలిపోయాయి.