ఒక్క సంతకంతో ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్న నయనతార, కొత్త సమస్యల్లో లేడీ సూపర్ స్టార్

First Published | Nov 14, 2022, 2:32 PM IST

ఒకటి పోతే మరొకటి లేడీ సూపర్ స్టార్ ఊపిరి మెసలనీయకుండా వెంటాడుతున్నాయి సమస్యలు. పెళ్ళికి ముందు పెళ్ళి తరువాత రకరాకల ప్రాబ్లమ్స్ ను ధైర్యంగా ఏదుర్కొన్ని నయన్.. ఇప్పుడు మరో కొత్త సమస్యలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. 
 

ఒకటి తరువాత మరోకటి సమస్యలు నయనతారను వెంటాడి వేధిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్  ఫేస్ చేసిన ఈ సీనియర్ బ్యూటీకి మరో తలనొన్ని వచ్చిపడింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నయన్- విఘ్నేల్ లు  పెళ్లికి ముందే  కొన్నాళ్లు డేటింగ్ చేశారన్న రూమర్ కూడా ఉంది.  అయితే అప్పటికే వీళ్లిద్దరూ కలిసి సౌదీలో పెట్టుబడులు పెట్టుకోచ్చారట. ఓ కంపెనీలో ఇద్దరు కలిసి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది .

అయితే  అప్పటికి వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు ..ఆ అగ్రిమెంట్లో వీళ్ళిద్దరూ విడివిడిగానే సంతకం చేస్తూ వుయ్ ఆర్ నాట్ మ్యారీడ్ అన్న అంశాన్ని గుర్తు చేశారు. అయితే రీసెంట్గా కవల పిల్లల విషయంలో నయనతార విగ్నేష్ శివన్ ప్రభుత్వానికి ..మేము ఆరేళ్ల ముందే పెళ్లి చేసుకున్నాం అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు. ఇదే ఇప్పుడు వీరిని సమస్యల్లో నెట్టేట్టు కనిపిస్తోంది. 


ఎప్పుడో పెళ్లి జరిగిందని చెప్పి ఒక చోట.. మరో చోట మేము సపరేట్ అని  డాక్య్యూమెంట్ ఫ్రూఫ్ తో సహా దొరకడంతో.. లీగల్ గా వీరికి సమస్యలు తప్పేట్టు లేవు. ఒకవేళ నిజంగా మీకు పెళ్లి అయ్యి ఉంటే అప్పుడు ఎందుకు మీరు విడివిడిగా సైన్ చేశారు అంటూ ప్రభుత్వం ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిసింది . 

ఒకవేళ ఇదే నిజమైతే మళ్లీ నయనతార విగ్నేష్ శివన్ కవల పిల్లలు సరోగసి ప్రాసెస్ లో అడ్డంగా బుక్ అయినట్లే అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సరోగసి విషయంలో రచ్చ రచ్చ జరిగింది. పెద్ద ఇష్యూ అవ్వడంతో పాటు... ఇండస్ట్రీని కూడా కుదిపేసింది. ఇప్పుడిప్పుడు ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుంది అనుకున్న టైమ్ లో ఇలా జరగడంతో అంతా షాక్ అవుతున్నారు

prabhu deva - nayanthara

పెళ్ళికి మందు ప్రేమ వ్యావహారాలతో చాలా చికాకులు ఫేస్ చేసింది నయనతార. శింబు, ప్రభుదేవ వల్ల అనవసరంగా రచ్చకెక్కింది. ఇక అన్నిసమస్యలు దాటు కుంటూ వస్తున్న సమయంలో.. మానసిక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేసింది. అవన్నీ దాటుకుని ధైర్యంగా అడుగులు వేసింది సీనియర్ బ్యూటీ.. 

ఇక దాదాపు ఐదేళ్ళు తనకంటే చిన్నవాడైన దర్శకుడు విఘ్నేష్ తో డేటింగ్ చేసి..రీసెంట్ గా పెళ్ళాడిన నయనతార..  పెళ్లి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుందో  తెలిసిందే. పెళ్లితోనే ఈ అమ్ముడు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టైంలో పెళ్లి ఫొటోస్ బయటకు రానివ్వకుండా నానా రచ్చ చేసి సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా ట్రోల్ అయింది . 
 

ఇక  పెళ్లి కుదిరిన తరువాత తర్వాత తిరుములలో ఫోటో షూట్ చేసి.. వివాదం అయ్యింది. పెళ్లి తరువాత కాళ్లకు చెప్పులు వేసుకుని హిందూ సాంప్రదాయాలను పట్టించుకోకుండా బిహేవ్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అయింది.ఇలాంటి కోకోల్లలు వివాదాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 

ఇక పెళ్లి తరువాత సరోగసితో ఎంత వివాదం అయ్యారో ఈజంట అందరికి తెలిసిందే. చట్టపరంగా వీరికి చిక్కులు ఎదురవ్వడంతో అంతటా ఇదే టాపిక్ నడిచింది ఆకరికి ఓమంత్రి కూడా ఇది నిజం అయితే వారిపై చర్యలు తప్పవు అనే వరకూ వెళ్ళంది. తరువాత ఈ వివాదాని తెలివిగాదాటకుని బటయ పడ్డారు స్టార్ కపూల్. 
 

కాని ఏదోఒక సమస్య ఈ జంటను వదలడంలేదు. ఇది కాకపో్తే ఇంకొకటి.. అది కాకపోతే ఇంకొకటి. ఇలా నయనతార - విఘ్నేష్ శివన్ లు ప్రశాంతంగా ప్రతికేట్టు కనిపించడంలేదు. మరి ఈ వివాదాలకు ఎప్పుడు తెరపడుతుందో. ఈ విషయంలో జాతక దోషాలు ఏమైనా ఉన్నయో ఎమో చూడాలి. 

Latest Videos

click me!