కారు టాప్ ఎక్కిన ఆద్య, తండ్రికి ఏమాత్రం తీసిపోదు.. నాన్నలాగే కూతురు అంటూ రేణు దేశాయ్ పోస్ట్

Published : Nov 14, 2022, 01:16 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్ వీలు చిక్కినప్పుడల్లా తన పిల్లలతో గడుపుతుంటారు.

PREV
16
కారు టాప్ ఎక్కిన ఆద్య, తండ్రికి ఏమాత్రం తీసిపోదు.. నాన్నలాగే కూతురు అంటూ రేణు దేశాయ్ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పవన్ వీలు చిక్కినప్పుడల్లా తన పిల్లలతో గడుపుతుంటారు. ఇక రేణు దేశాయ్ ఎప్పుడూ అకీరా, ఆద్యాతోనే ఉంటుంది. 

26

వాళ్ళిద్దరి అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మూవీ షూటింగ్ కి కూడా సమయం కేటాయించడం కష్టంగా మారిపోతోంది. కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామానికి వెళుతూ కారు టాప్ పై కూర్చుని ప్రయాణించారు. 

36

ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నేషనల్ మీడియాలో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. పవన్ అలా కారు టాప్ పై ప్రయాణించడంతో ఎపి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటంలో ఇళ్ళు కోల్పోయిన ప్రజలని పరామర్శించేందుకు అలా కారు టాప్ పై ప్రయాణించారు. ఏది ఏమైనా ఈ సంఘటన వివాదంగా మారింది. 

46

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య కూడా కారు టాప్ పై ప్రయాణించింది. అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పైకి ఎక్కకపోయినా.. కారు టాప్ డోర్ ఓపెన్ చేసి ప్రయాణించింది. ఈ వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

56

'నాన్న లాగే కూతురు' అంటూ ఈ వీడియోకి రేణు దేశాయ్ క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఆద్య వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆద్య తండ్రికి ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని నెటిజన్లు సూచిస్తున్నారు. 

66

తాము విడిపోయినప్పటికీ పిల్లల విషయంలో పవన్, రేణు దేశాయ్ ప్రేమతో ఉంటారు. ఆ మధ్యన అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి పవన్, రేణు ఇద్దరూ హాజరయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories