ఈరోజు ఎపిసోడ్లో వేద అక్కడికి రావడం చూసి యష్ మాళవిక ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు వేద సారీ అండి నేను మీకు చెప్పకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదిగో ఇతని వల్లే ఇతను మీ గురించి ఏదో వాగుతున్నాడు అని అంటుంది వేద. ఈ అభిమన్యు మీ గురించి నాకు మీరు అబద్ధాలు చెబుతున్నారని మీరు నన్ను మోసం చేస్తున్నారని, నా దగ్గర ఏదో రహస్యం దాచాలని ట్రై చేస్తున్నారంట, అంతేకాదు మీరు మాళవిక ని కాపాడాలని ట్రై చేస్తున్నారంట అనడంతో యష్, మాళవిక ఇద్దరు షాక్ అవుతారు. అసలు మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు ఈ మాళవికనే అని అభిమన్యు చెబుతున్నాడు అంటుంది వేద.