నయనతార సోషల్ మీడియాకి, మీడియాకి దూరంగా ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ మాత్రమే సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే నయనతార, విగ్నేష్ వివాహం జరిగి ఏడాది గడచిపోయింది. నేడు నయన్, విగ్నేష్ ల ఫస్ట్ మ్యారేజ్ యానవర్సరీ. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో నయనతార తమ కవల పిల్లలని ఎత్తుకుని ఉన్న ఫొటోస్ ని షేర్ చేశాడు.