నందమూరి నటసింహం మొన్నటి వరకు సీనియర్లలో తిరుగులేని స్టార్‌గా రాణించారు. వరుసగా నాలుగు విజయాలు అందుకొని దూసుకుపోయారు. ఆయన స్పీడ్‌కి `అఖండ 2` బ్రేకులు వేసింది. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫలితం బాలయ్య భవిష్యత్‌ని తలక్రిందులు చేసింది. ఆయన నెక్ట్స్ సినిమా జాతకమే మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో వందకోట్లకుపైగా బడ్జెట్‌తో చేయాలనుకున్న సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మరో దెబ్బ పడింది.
24
బడ్జెట్ కారణంగా ఎన్బీకే111లో మార్పులు
బాలకృష్ణ ప్రస్తుతం `ఎన్బీకే111`లో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. మొదట ఈ మూవీని హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కించాలని భావించారు. దానికి భారీగా బడ్జెట్ అవుతుంది. బాలయ్యపై ఇంతటి బడ్జెట్ కష్టమని భావించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. దీంతో కథనే మార్చేశారు. హిస్టారికల్ అంశాలను తీసేసి ముంబయి మాఫియా నేపథ్యంలో సినిమాని రూపొందిస్తున్నారట. ప్రస్తుతం సైలెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
34
ఎన్బీకే 111 నుంచి నయనతార ఔట్
ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తుందని ప్రకటించారు. లేడీ సూపర్ స్టార్ ఫైనల్ అయ్యిందని చెప్పారు. ఇండస్ట్రీలో బాలయ్య, నయనతార జోడీకి మంచి క్రేజ్ ఉంది. మంచి విజయాలు ఉన్నాయి. `సింహ`, `శ్రీరామరాజ్యం`, `జై సింహ` వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నయనతార నటించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఆమెని తీసుకున్నారు. కానీ నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. బడ్జెట్ దృష్ట్యా స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేశారు. దీంతో ఆమె బాలయ్యకి హ్యాండిచ్చిందట. సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.
ఈ క్రమంలో ఇప్పుడు ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. కాజల్ లైన్‌లోకి వచ్చిందట. హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందట. ఆమె బాలయ్యతో `భగవంత్ కేసరి`లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాజల్‌ని ఎంపిక చేశారట. ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. ప్రస్తుతం కాజల్ `రామాయణ`లో నటిస్తుందని సమాచారం. తెలుగులో సినిమాలు లేవు. దీంతో బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.