చిరంజీవి హీరోగా రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. తన రేంజ్ ఏంటో తెలియజేసే బ్లాక్ బస్టర్‌ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రీజనల్ మూవీస్‌లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు సరికొత్త మైల్ స్టోన్‌ని చేరుకుంది. వంద రోజులు పూర్తి చేసుకుంది.
25
వంద రోజులు పూర్తి చేసుకున్న చిరంజీవి మూవీ
ఇప్పుడున్న కాలంలో ఒక సినిమా పది రోజులు ఆడితే గ్రేట్. నెల రోజులు ఆడితే రికార్డు. యాభై రోజులు ప్రదర్శించబడితే అది అరుదైన రికార్డుగా చెబుతుంటారు. అయితే చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ మాత్రం ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మైదుకూరు లోని వెంకటేశ్వర థియేటర్లో, అలాగే ఎర్రగుండ్లలని హేమ పిక్చర్ ప్యాలెస్‌లో వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో చిరంజీవి సినిమా సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.
35
మన శంకర వరప్రసాద్ గారు మూవీ బిజినెస్
`మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాని నిర్మించడం వల్ల నిర్మాతలు ఎంత లాభాలు గడించారనేది చూస్తే. ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.150-200కోట్లు అని సమాచారం. ఈ చిత్రానికి రూ.120కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకొని సుమారు రూ.60కోట్లకుపైగా వచ్చినట్టు సమాచారం. అంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రాఫిట్‌లో ఉంది.
ఇక ఈ చిత్రం మొత్తం వంద రోజుల్లో సుమారు రూ.305-310 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థియేట్రికల్ రైట్స్ పోనూ సుమారు రూ.60-70కోట్ల లాభాలు తెచ్చింది. ఈ మూవీని సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించారు. `మనశంకర వర ప్రసాద్‌గారు` ద్వారా నిర్మాతలకు గట్టిగానే లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. అటు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా లాభాలు చూశారు. ఈ సినిమాతో చిరంజీవి కూతురు ఇక నిర్మాతగా సెట్ అయ్యిందని, ఆమె లైఫ్‌లోనూ సెటిల్ అయ్యిందని చెప్పొచ్చు. భవిష్యత్‌లో భారీ సినిమాలు రూపొందించే ప్లాన్‌లో ఉందని సమాచారం.
55
ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన మన శంకర వర ప్రసాద్ గారు
చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ క్యామియో రోల్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. క్లైమాక్స్ కి ముందు వచ్చిన ఆయన మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఇదొక రెగ్యూలర్ కమర్షియల్ మూవీ. కామెడీ బాగా వర్కౌట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ఫ్యామిలీ అంశాలను పర్ ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు. చిన్నపిల్లలకు కనెక్ట్ అయ్యే అంశాలను, ఆడవాళ్లకి సంబంధించిన సీన్లు కూడా పెట్టాడు. మొత్తంగా మంచి ఫుల్ మీల్స్ పెట్టాడని చెప్పొచ్చు. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. మూవీని బ్లాక్ బస్టర్ చేశారు.