Jr NTR
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రతి చిత్రంలో కొన్ని యాక్షన్ స్టంట్స్ చేసేందుకు హీరోలని కాకుండా వారి డూప్ లని దర్శకులు ఉపయోగిస్తుంటారు. ప్రతి హీరోకి బాడీ డబుల్ ఉంటారు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ కి కూడా బాడీ డబుల్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కి డూప్ గా ఈశ్వర్ హారిస్ అనే వ్యక్తి నటించారు.
RRR Movie
ఈశ్వర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నటనపై ఆసక్తితో టాలీవడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈశ్వర్ ఆచార్య చిత్రంలో రాంచరణ్ స్నేహితుడిగా నటించారు. జార్జ్ రెడ్డి మూవీలో చిన్న పాత్రలో నటించారు. అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూప్ కోసం వెతుకుతున్న సమయంలో రాజమోళికి ఈశ్వర్ గురించి తెలిసిందట. చూడడానికి ఎన్టీఆర్ లానే ఉండడంతో డూప్ గా నటించే అవకాశం వచ్చింది.
Jr NTR Body Double
ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొన్ని సీన్లలో తారక్ కి డూప్ గా కనిపిస్తాను. కొమరం భీముడో సాంగ్ లో నాలుగు షాట్స్ లో నేను ఉంటాను. ఎన్టీఆర్ ని గొలుసులతో పైకి వేలాడదీసే సన్నివేశంలో కనిపించింది నేనే అని ఈశ్వర్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఫైట్స్ లో నేను కనిపించలేదు అని ఈశ్వర్ తెలిపారు. వార్ 2లో కూడా ఎన్టీఆర్ కి డూప్ గా నటించే అవకాశం వచ్చింది. వెంటనే ముంబై రావాలని అడిగారు. ట్రావెల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్లు ఏమీ ఉండవని చెప్పారు.
Jr NTR Body Double
వాళ్ళు చెప్పిన రెమ్యునరేషన్ కూడా నాకు నచ్చలేదు. దీనితో వార్ 2లో ఎన్టీఆర్ కి డూప్ గా చేసే ఛాన్స్ వదులుకున్నట్లు ఈశ్వర్ తెలిపారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ వాళ్ళు దారుణంగా ఉన్నారని అనిపించింది అని ఈశ్వర్ తెలిపారు. అదే విధంగా తాను ఎన్టీఆర్ కోసం జెప్టో యాడ్ లో కూడా నటించినట్లు ఈశ్వర్ తెలిపారు. డూప్ గా నటిస్తే సినిమాని బట్టి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుంది అని ఈశ్వర్ పేర్కొన్నారు.
Jr NTR Body Double
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. మరో ప్రశాంత్ నీల్ మూవీలో ఈశ్వర్ కి అవకాశం వస్తుందేమో చూడాలి. కొన్నిసార్లు డూప్ గా చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన స్టంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది.