నయనతార ఓ రేర్ రికార్డును సాధించింది. ఒకే కథతో.. మూడు సినిమాలు ముగ్గరు స్టార్ హీరోలతో నటించింది. మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు తమిళ భాషల్లో నయనతార నటించిన ఆ మూడు సినిమాలేంటి?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటించిన ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈసినిమా కథ కూడా భార్యాభర్తలు విడిపోయి, మళ్లీ కలవడమే. ఈ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. అయితే నయనతార ఇదే కథతో మూడు సినిమాల్లో నటించింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.
25
తులసి
2007లో వచ్చిన 'తులసి' సినిమా కథ కూడా భార్యభర్తల మధ్యే జరుగుతుంది. ఈ సినిమాలో కూడా ఈగో కారణంగా హీరో వెంకటేషన్ ను వదిలి భార్య వెళ్ళిపోతుంది. చివరకు విలన్ నుంచి కొడుకును కాపాడటానికి, భార్యాభర్తలు మళ్లీ కలుస్తారు. ఇందులో నయనతార, వెంకటేష్ జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. మళ్లీ ఇన్నేళ్లకు రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకీ తో స్క్రీన్ షేర్ చేసుకుంది నయనతార.
35
విశ్వాసం
'తులసి' స్ఫూర్తితో శివ తీసిన సినిమా 'విశ్వాసం'. భర్త రౌడీ అని భార్య విడిపోతుంది. తర్వాత కూతురిని కాపాడటానికి భర్త బాడీగార్డ్‌గా వస్తాడు. తన కూతురిని రౌడీల నుంచి కాపాడుకుని.. భార్యతో కలిసిపోతాడు. అజిత్, నయనతార జోడీ ఈసినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈసినిమాా కూడా సూపర్ హిట్ అయ్యింది.
'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో కూడా చిరంజీవి, నయనతార సేమ్ కథతో కనిపించారు. ఈగో కారణంగా నయనతార చిరంజీవిని వదిలి విడాకులు తీసుకుంటుంది. ఆతరువాత తన పిల్లలను కలుసుకోవాలని వెళ్లి..ఆపద నుంచి తన ఫ్యామిలీని కాపడుకుంటాడు హీరో. కథ పాతదే అయినా, తీసిన విధానం కొత్తగా అనిపించింది. మొత్తానికి సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.
55
నయనతార రేర్ రికార్డ్...
ఈ మూడు సినిమాల్లో ఒకే కథ ఉన్నా, అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరో విశేషం ఏంటంటే, ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ నయనతారే. ఒకే కథతో మూడు హిట్లు కొట్టింది.