The Raja Saab 6 Days Collection: ది రాజాసాబ్‌కి ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు.. ప్రభాస్‌ టార్గెట్‌కి ఎంత దూరంలో ఉన్నాడంటే

Published : Jan 15, 2026, 01:40 PM IST

The Raja Saab 6 Days Collection: ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ `ది రాజాసాబ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. అయితే ఈ మూవీకి ఐదో రోజుతో పోల్చితే ఆరో రోజు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. 

PREV
15
ది రాజా సాబ్‌ మూవీ కలెక్షన్లు

ప్రభాస్ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ 'ది రాజా సాబ్' జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కి ముందు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా తర్వాత  తగ్గిపోయింది. సినిమాకి విపరీతమైన నెగటివ్‌ టాక్‌ వచ్చింది. అది మూవీపై తీవ్ర ప్రభావం చూపించింది.  అంతిమంగా కలెక్షన్లపై ఆ ప్రభావం కనిపించింది. 

25
ది రాజా సాబ్‌ మూవీ ఆరో రోజు కలెక్షన్లు

ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' వసూళ్ల లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమా వసూళ్లు రోజురోజుకు వేగంగా పడిపోతున్నాయి. సినిమా విడుదలై 6 రోజులు కాగా, ఆరో రోజు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నికరంగా రూ.124.65 కోట్లు రాబట్టింది. 

35
ఆరో రోజు పెరిగిన కలెక్షన్లు

'ది రాజా సాబ్' సినిమా ప్రీ-సేల్‌లో దాదాపు రూ.9.15 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో, మొదటి రోజు రూ.53.75 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. రెండు, మూడో రోజుల్లో ఈ సినిమా రూ.26 కోట్లు, రూ.19.1 కోట్లు వసూలు చేసింది. తొలి సోమవారం నాల్గో రోజు రూ.6.6 కోట్లు, ఐదో రోజు రూ.4.8 కోట్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఆరో రోజు వసూళ్లు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది కంటిన్యూ అవుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

45
ప్రభాస్‌ బాక్సాఫీసు టార్గెట్‌

ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.175.70 కోట్లు వసూలు చేసింది. అయితే టీమ్‌ మాత్రం ఈ మూవీ ఇప్పటికే రెండు వందల కోట్లు దాటినట్టు ప్రకటించింది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా బడ్జెట్‌లో సగం కూడా రాబట్టలేకపోయింది.  ఈ నాలుగు రోజులు వసూళ్లని బట్టి దీని ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబడితేనే ఇది సేఫ్‌లో ఉంటుంది. లేదంటే డిజాస్టర్‌ అనే చెప్పొచ్చు. ఏం జరుగుతుందో చూడాలి. 

55
సైకలాజికల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా ది రాజా సాబ్‌

'ది రాజా సాబ్' ఒక హారర్ కామెడీ సినిమా. ఇందులో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories