విడాకుల రూమర్స్ కి చెక్.. ఆ గుడిలో భర్తతో కలిసి సాష్టాంగ నమస్కారాలు చేసిన నయనతార, వైరల్ ఫోటోస్

Published : Jul 06, 2025, 01:43 PM IST

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

PREV
15

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు పదుల వయసులో కూడా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ గా క్రేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో నయనతార అగ్రస్థానంలో ఉన్నారు. నయనతార తరచుగా వార్తల్లో ఉంటుంది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె గురించి అనేక రూమర్స్ వస్తుంటాయి.

25

కొన్ని రోజులుగా నయంతార విడాకులకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త విగ్నేష్ శివన్ నుంచి నయనతార విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఒక తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది జీవితంలో చేసిన పెద్ద తప్పు అవుతుంది అంటూ నయనతార పోస్ట్ చేసినట్లుగా ఓ ఇంస్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నయనతార స్వయంగా చేసిన పోస్ట్ అంటూ ప్రచారం జరిగింది. అయితే కొందరు మాత్రం అది ఫేక్ అని ఖండించారు.

35

ఏది ఏమైనా ఆ పోస్ట్ వలన నయనతార, విగ్నేష్ శివన్ విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఎట్టకేలకు నయనతార ఈ విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టారు. తాజాగా ఆమె తన భర్త విగ్నేష్ శివన్, పిల్లలతో కలిసి పళని మురుగన్ టెంపుల్ ని సందర్శించారు. భర్త పిల్లలతో కలిసి నయనతార ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

45

ఆలయంలో నయనతార ఎంతో భక్తి శ్రద్ధలతో కనిపించింది. ఆలయంలో సాష్టాంగ నమస్కారాలు చేసింది. ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల ద్వారా నయనతార తాను, తన భర్త ఎంతో అన్యోన్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పింది. దీంతో విడాకుల రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది. పళని మురుగన్ టెంపుల్ ను తమిళ హీరోలు ధనుష్, కార్తీ, శివ కార్తికేయన్ లాంటి వారు తరచుగా సందర్శిస్తుంటారు. ఆ ఆలయం చెన్నై నుంచి 400 కిలో మీటర్ల దూరంలో ఉంది. 

55

ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా 157 చిత్రంలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల తర్వాత నయనతార చిరంజీవితో కలిసి నటిస్తున్న మూడవ చిత్రం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories