సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మొదటి స్థానం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే దక్కింది. ఈమధ్య కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే సౌత్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదిగారు.
పుష్ప: ది రైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ హీరో పుష్ప 2: ది రూల్ మూవీతో బాహుబలి రికార్డ్ ను కూడా కొల్లగొట్టాడు. ఈ మెగా విజయం తర్వాత అల్లు అర్జున్ 300 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా బన్నీకి భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
పుష్ప2 సినిమా కు సౌత్ కంటే బాలీవుడ్ నుంచే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు.