సమంతకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ పంపించిన నయనతార, సామ్ రియాక్షన్ ఏంటంటే.?

First Published | Oct 11, 2023, 7:12 PM IST

ప్రస్తుతం ప్రపంచ యాత్రలో బిజీగా ఉన్న సమంతకు..ఎక్కడుందో కనుకుని మరీ ప్రత్యేక బహుమతి పంపించింది స్టార్ హీరోయిన్ నయనతార. ఇంతకీ ఆమె ఏం గిఫ్ట్ పంపించింది. 
 

నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉన్నా.. యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువగా దూసుకుపోతున్నారు నయనతార, సమంత. రెమ్యూనరేషన్ విషయంలో కాని... సినిమాల విషయంలో కాని ఇద్దరిలో ఎవరూ కాంప్రమైజ అవ్వడం లేదు. అంతే కాదు ఈ ఇద్దరు తారలు కూడా మంచి ఫ్రెండ్స్ అవ్వడంతో.. ప్రత్యేక సందర్భాల్లో ఇద్దరు కలిసి అభిమానులకు కనులవిందు చేస్తుంటారు. 
 

తాజాగా తన స్నేహితురాలు సమంతకు ప్రత్యేకమైన బహుమతి పంపించింది నమనతార. నయనతార సినిమాలు మాత్రమే కాకుండా సొంతంగా బిజినెస్ ను కూడా చేస్తోంది. నయనతార రీసెంట్ గా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. 9 స్కిన్ అనే కాస్మెటిక్స్ బిజినెస్ స్టార్ట్ చేసి అందానికి మెరుగులు దిద్దే..బ్యూటీ  ప్రోడక్ట్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది. వీటికి ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా చేస్తోంది నయనతార. 
 


ఇక ఇందులో భాగంగం తన స్నేహితురాలుసమంతకు తన సొంత సంస్థ 9 స్కిన్ నుంచి  పేస్ క్రీం ప్రోడక్ట్స్ ని పంపించింది. ఈ విషయాన్ని సమంత స్వాయంగా వెల్లడించింది. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి నేను ఆసక్తిగా ఉన్నాను... 9 స్కిన్ కి అల్ ది వెరీ బెస్ట్ నయనతార అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది

ఇక ఈ ఇదరు తారల కోఆపరేషన్ కు నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. రీసెంట్ గా బాలీవుడ్ గుమ్మం తొక్కింది.  జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. షారుఖ్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించింది.  మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో 1000 కోట్ల హీరోయిన్ అనిపించుకుంది. 

అంతే కాదు  బాలీవుడ్ లో మరో అవకాశం కూడా సాధించిందట నయనతార. ఇక సమంత విషయానికి వస్తే.. ఆమె రీసెంట్ గా ఖుషి సినిమాతో అభిమానులను పలకరించింది. నెక్ట్స్ రెండు మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉండగా.. ఏడాది పాటుసినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తనను ఇబ్బందిపెడుతున్నమయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అంతే కాదు అటు ట్రీట్మెంట్ తో పాటు.. ఇటు వెకేన్లను కూడా ఎంజాయ్ చేస్తోంది. 

ఆమధ్య అమెరికాతో స్టార్ట్ చేసిన సమంత.. ఆతరువాత ఆస్ట్రియా.. ఇండియా.. ఆతరువాత ప్రస్తుతం దుబాయ్ చేరింది. ప్రపంచ యాత్ర చేస్తున్న తను ఎక్కడున్నది తెలుసుకుని మరీ.. ప్రత్యేకంగా గిఫ్ట్ పిపించినందకు సమంత ప్రత్యేకంగా నయనతారకు థ్యాంక్స్ చెప్పింది. 

Latest Videos

click me!