విష్ణుప్రియాకి అన్యాయం చేశాను, బిగ్‌ బాస్‌ షోలో తండ్రి ఆవేదన.. కోడలిగా పృథ్వీరాజ్‌ తల్లి గ్రీన్‌ సిగ్నల్‌

First Published | Nov 14, 2024, 11:50 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఫ్యామిలీ వీక్లో గురువారం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. విష్ణు ప్రియా, పృథ్వీరాజ్‌ లవ్‌ ట్రాక్‌ ఓపెన్‌ అయ్యింది. పెళ్లిళ్ల వరకు వెళ్లింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 పదకొండో వారం ఫ్యామిలీ వీక్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిణి, అవినాష్‌, యష్మి, నిఖిల్‌, నబీల్‌ పేరెంట్స్ వచ్చి సందడి చేశారు. ఆయా కంటెస్టెంట్లని హ్యాపీ చేశారు. గురువారం ఎపిసోడ్‌లో మరో ముగ్గురు వచ్చారు. విష్ణు ప్రియా తండ్రి, పృథ్వీరాజ్‌ తల్లి, గౌతమ్‌ అన్న వచ్చారు. ప్రేరణ బాయ్‌ ఫ్రెండ్‌ అనుకోకుండా రాలేకపోతున్నట్టు తెలిపారు. వీడియో పంపించాడు. అలాగే ఆయన కటౌట్‌ వచ్చింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక విష్ణు ప్రియా తండ్రి ఆమెతో చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాడు. చాలా విషయాలు చెప్పాడు రిలేషన్‌ ముఖ్యం కాదని, అది ఇక్కడికే పరిమితమని, కానీ సొంత ఆట ముఖ్యమని, ఈ రిలేషన్స్ కంటిన్యూ కావు, కాకపోతే అందరితోనూ బాగుండాలని, ఆట ఇంకా బాగా ఆడాలని తెలిపారు. రిలేషన్‌ విషయంలో బ్యాడ్‌ అవుతున్నావని కూడా తెలిపారు. పృథ్వీరాజ్‌తో విష్ణు ప్రియా క్లోజ్‌గా మూవ్ అవుతుంది.

ఇంకా చెప్పాలంటే లవ్‌ ట్రాక్‌ నడిపిస్తుంది. అయితే దాన్ని తగ్గించుకో అని చెప్పాడు. విష్ణు ప్రియాని చిన్నప్పుడు పట్టించుకోలేదని, తను పుట్టినప్పుడు దగ్గర లేను అని, చూసేందుకు కూడా రాలేకపోయానని, కొన్ని పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని, అందుకు సారీ చెప్పాడు. విష్ణు ప్రియా ఎవరి సపోర్ట్ లేకుండా తనే స్వతహాగా ఎదిగిందని, తన ప్రోత్సాహం ఏం లేదని, తాను డబ్బులు కూడా ఇవ్వలేకపోయానని చెప్పాడు. ఓ రకంగా ఆవేదన వ్యక్తం చేశాడు. 
 


ఇప్పుడైనా పట్టించుకోవాలని, పెళ్లి చేయాలని కంటెస్టెంట్లు చెప్పగా, మ్యారేజ్‌ చేస్తానని, ఆమెకి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తా అని, అతను ఎక్కడ ఉన్నాడో తెలియదన్నాడు.  అయితే ఇక్కడే ఉన్నాడని కంటెస్టెంట్లు చెప్పగా, ఇవన్నీ ఉత్తిత్తి వ్యవహారాలు అని తేల్చేశాడు.  కానీ విష్ణు ప్రియా అలా కాదని, ఇతర కంటెస్టెంట్లు ఇక్కడే ఉన్నాడని చెప్పగా, అదైనా ఓకే, ఆమెకి నచ్చిన వాడితోనే పెళ్లి చేస్తా అని ప్రకటించాడు. విష్ణు ప్రియని ఖుషీ చేశాడు.

అనంతరం పృథ్వీరాజ్‌ అమ్మ వచ్చింది. ఆమె చాలా ఓపెన్‌గా కామెంట్లు చేసింది. బాగా ఆట ఆడుతున్నావని, సేవ్‌ అయిన ప్రతిసారి ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పడం లేదని, కచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలని తెలిపింది. అంతేకాదు హౌజ్‌లో సపోర్ట్ ఎవరూ లేరని ఆడియెన్స్ సేవ్‌ చేస్తున్నారని, వారికి థ్యాంక్స్ చెప్పాలని వెల్లడించింది. 

విష్ణు ప్రియా గురించి చెబుతూ, అమ్మాయి బాగుందని, బాగా ఆడుతుందని తెలిపింది. ఆమె తనకు బాగా నచ్చిందని తెలిపింది. మంగుళూరు తీసుకురానా? అని పృథ్వీ అడగ్గా తీసుకురా అని చెప్పింది. కోడలిగా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే ఆమె సరదాగా స్పందించింది. ఈ కన్వర్జేషన్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఫైనల్‌గా కప్‌ తో ఇంటికి రావాలని చెప్పింది పృథ్వీ తల్లి. విష్ణు ప్రియాపై మాత్రం అమితమైన ప్రేమని చూపించింది. 
 

చివరగా గౌతమ్‌ బ్రదర్ వచ్చాడు. బాగా ఆడుతున్నావని, ఆట పుంజుకుందని, అదే కాన్ఫిడెన్స్ తో ఆడాలని తెలిపింది. ఇక లవ్‌ స్టోరీల జోలికి వెళ్లొద్దని తెలిపారు. ట్రయాంగిల్‌, రెక్టాంగిల్‌ అంటూ వద్దు. ఆ ట్రాప్‌లో పడకు అని, కేవలం నీకు నువ్వు ఆడు, లవ్‌ వైపు వెళ్లొద్దని తేల్చేశాడు. కప్‌ గెలవాలని తెలిపారు.

అయితే అందరితోనూ మాట్లాడిన గౌతమ్‌ అన్న, యష్మి వద్దకు వెళ్లలేదు.  ఆమె కూడా దూరంగానే ఉంది. మరోవైపు తన ఫ్యామిలీ రాలేదని టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ ఫ్యామిలీని పంపించాలని వేడుకున్నాడు. కానీ బిగ్‌ బాస్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తుంది. 

Read more:చిరు, నాగ్‌, బాలయ్య, ప్రభాస్‌, మహేష్‌ సరసన నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు

also read: అయ్యో! విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందా! పరిస్థితి చూస్తే అలానే ఉంది
 

Latest Videos

click me!