100 కోట్లు ఇచ్చినా కూడా ఆ హీరోతో సినిమా చేయను అని ముఖం మీదే చెప్పేసిందట లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసింది. ఆ హీరో ఎవరు? ఆ నిజాన్ని బయటపెట్టింది ఎవరు?
ఇండియాన్ సినిమాలో మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలో దూసుకుపోతోన్న నయనతార 100 కోట్లు ఇచ్చినా ఒక హీరోతో మాత్రం నటించనని ముఖంమీదనే చెప్పేసిందట. నయనతార తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ గా వెుగు వెలుగుతోంది. సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈసీనియర్ బ్యూటీ.. ఆసినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక తర్వాత నయనతారకు చాలా డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం కెజియఫ్ స్టార్ యష్ తో కలిసి టాక్సిక్ సినిమా లో నటిస్తోంది నయనతార. ఈసినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ స సినిమా షూటింగ్ తో పాటు వివరాల గురించి చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.
ఈసినిమా కథ, నటీనటుల గురించి కూడా గుట్టుగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి ఇంకా చాలా మంది నటిస్తున్నారని అంటున్నారు. మలయాళం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
legend team tried to cast nayanthara with saravanan jd jerry nsn
జవాన్ సినిమా 1000 కోట్లకుపైగా వసూలు సాధించగా.. ఈసినిమాకు నయన్ 10 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నయనతార తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది. కానీ ఒక హీరోతో మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన నటించనని చెప్పేసిందట.
10 కాదు 100 కోట్లు ఇచ్చినా పని చేయనని చెప్పింది. ఆ హీరో ఎవరో కాదు శరవణన్. అతను తమిళ నటుడు. 2022లో ది లెజెండ్ సినిమా రిలీజ్ అయింది. శరవణన్ హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కాలేదు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని శరవణన్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నయనతార ఒప్పుకోలేదు.
దాంతో నయనతార బదులు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా శరవణన్‌కు హీరోయిన్‌గా నటించింది. రెమ్యూనరేషన్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ఆలియా భట్ చాలా ముందున్నారు. దీపికా పదుకొణె, ఆలియా భట్ రెమ్యూనరేషన్ 15 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకుంటారు. కానీ శరవణన్ విషయంలో నయనతార అలా ఎందుకు చెప్పిందో అని చాలా చర్చలు జరుగుతున్నాయి.
కానీ నయనతార ఇప్పటి వరకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ తమిళ మీడియాలో సినిమా జర్నలిస్ట్ బాలు ఈ విషయం రివీల్ చేశారు. నయనతార ఇంటి ముందు అప్పుడప్పుడు రోల్స్ రాయ్స్ కారు ఉండేది. అది చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత అదే కారు ఒక పెళ్లిలో కనిపించినప్పుడు విషయం తెలిసింది. అది లెజెండ్ శరవణన్ కారు. ఆయన తన సినిమాలో నటించమని నయనతారని చాలా అడిగారు. చాలాసార్లు ఆమె ఇంటికి కూడా వెళ్లిన విషయం తెలిసింది.
అంతేకాదు, తన సినిమాలో నయనతార నటిస్తే డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసింది. కానీ ఎందుకో తెలీదు, 100 కోట్లు ఇచ్చినా నేను నటించను అని నయనతార స్ట్రాంగ్‌గా చెప్పారట అని విషయం బయటపెట్టారు. నయనతార సినిమాతో పాటు కొన్ని బిజినెస్‌ల ద్వారా కూడా తనను తాను నిరూపించుకుంది. తన కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ వ్యాపారం మీద దృష్టి పెట్టే నయనతారకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా సపోర్ట్ చేస్తారు. సినిమా, వ్యాపారం ద్వారా నయనతార కోట్లు సంపాదిస్తున్నారు.