క్రిప్టో కేసులో కాజల్, తమన్నా! విచారణకు పోలీసులు!

Published : Feb 28, 2025, 07:07 AM IST

Kajal Agarwal and Tamannah Bhatia: పుదుచ్చేరి క్రిప్టో కరెన్సీ మోసం కేసులో కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాను విచారించనున్నారు. క్రిప్టో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.2.40 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది.

PREV
13
క్రిప్టో కేసులో కాజల్, తమన్నా! విచారణకు పోలీసులు!
Kajal Agarwal and Tamannah Bhatia in Cryptocurrency case in telugu

Kajal Agarwal and Tamannah Bhatia:  పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి చెందిన  కేసులో హీరోయిన్స్  తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చని ఆశ చూపి పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్‌ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. 
 

23
Kajal Agarwal and Tamannah Bhatia in Cryptocurrency case in telugu

 
 క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి తమన్నా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మహాబలిపురంలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ కంపెనీ కార్యక్రమానికి నటి కాజల్‌ అగర్వాల్‌ హాజరయ్యారు. 

33
Kajal Agarwal and Tamannah Bhatia in Cryptocurrency case in telugu


ఆ తర్వాత ముంబయిలో పార్టీ నిర్వహించి, వేలాది మంది నుంచి డబ్బు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి నితీష్‌ జెయిన్‌(36), అరవింద్‌కుమార్‌(40)లను అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని నిర్ణయించారు.
 

Read more Photos on
click me!

Recommended Stories