భారీ ఆఫర్ ను చేతులారా వదిలేసుకుందట సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. 100 కోట్లు ఇస్తామన్నా.. ఆ హీరో పక్కన నటించను అని తెగేసి చెప్పిందట. ఇంతకీ ఎవరా హీరో..? ఏంటా కథ.
తమిళనాట భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ నయనతార. తమిళంలోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళంలో కూడా నయన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 30 దాటితే అయిపోతూ ఉంటుంది.. 35 కి కెరీర్ ఆగిపోయి తెరమరుగైన స్టార్స్ చాలా మంది ఉన్నారు. కాని నయనతార మాత్రం 40 కి అడుగు దూరంలో ఉన్నా..స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతోంది.
27
ఇప్పటికే తెలుగు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది నయన్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సత్తా చాటింది. ఇక అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డ్ సాధించింది నయనతార. అయితే తాజాగా ఆమె ఓ భారీ ఆఫర్ ను వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. 100 కోట్లు ఇచ్చినా ఆసినిమా చేయను అని ఆమె చెప్పిందట. ఇంతకీ ఎంటా సినిమా అంటే..?
37
Legend Saravanan
తమిళ హీరో.. అరుళ్ శరవణన్ తో నటించని నయనతార చెప్పినట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. 50 ఏళ్లు దాటిన తరువాత హీరోగా ఎంటర్ అయ్యాడు శరవణన్. బిజినెస్ మెన్ గా కోట్లు సంపాధించిన ఆయన 2002 లో వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. ఈ ఏజ్ లో.. హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరకి షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఆయన మీద పలు మీమ్స్. కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో.
47
Legend saravanan
అంతే కాదు ఆయన చేసింది కూడా ఒన్లీ తమిళ సినిమా కాదు అది పాన్ ఇండియా మూవీ కావడం మరో షాకిచ్చే అంశం. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్ వంటి స్టార్లు కూడా నటించారు.
57
Legend Saravanan
ఈసినిమాతో ట్రోల్స్ కూడా ఫేస్ చేశాడు ఈ హీరో. అయితే ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా.. శరవణన్ మాత్రం బాగా ఫేమస్ అయ్యారుడు దేశ వ్యాప్తంగా మనోడిపేరు మార మోగిపోయింది. ఈసినిమా కోసం ఊర్వశికి 20 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు అప్పట్లో గట్టిగా టాక్ నడిచింది.
67
ఎవరూ ఆయన పక్కన నటించడానికి ఒప్పుకోలేదని నెట్టింట టాక్ అందుకే అంత ఇచ్చి ఊర్వశిని తీసుకున్నారట. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కాని రూమర్ మాత్రం గట్టిగా నడిచింది. ఇక అసలు విషయం ఏంటీ అంటే.. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలి అని గట్టిగా ప్రయత్నం చేశాడట శరవణణ్.
77
ఈ విషయంలో కూడా ఎంతవరకు నిజముందో తెలీదు కానీ, ఈ సినిమాలో ముందుగా నయనతారని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని శరవణన్ ఎక్కువ ప్రయత్నాలు చేశాడట. అందుకోసం రోజూ ఆమె ఇంటికి తన మేనేజర్ ను పంపి ఎక్కువ పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశాడట. కానీ నయన్ మాత్రం 100 కోట్లు ఇచ్చినా నేను అతని పక్కన నటించను అని తెగేసి చెప్పిందట. ఈ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.