తెలుగులో 'గుప్పెడంత మనసు' సీరియల్ తో అలరించిన జగతి మేడమ్ ఇకపై వెబ్ సిరీస్ లు, సినిమాలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’, ‘ప్రెటీ గర్ల్’ అనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బోల్డ్ పెర్పామెన్స్ తో అదరగొట్టబోతున్నట్టు ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్థమవుతోంది.