Nayanthara: ధనుష్ కి దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన నయనతార.. పేట్రియాట్ ముందు తేలిపోతున్న కర

Published : May 02, 2026, 04:56 PM IST

Nayanthara: మహేష్ నారాయణన్ డైరెక్షన్‌లో నయనతార, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ లాంటి భారీ తారాగణం నటించిన 'పేట్రియాట్' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 

PREV
14
పేట్రియాట్‌ మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్

మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించిన సినిమా 'పేట్రియాట్'. కొత్తతరం డైరెక్టర్ మహేష్ నారాయణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరితో పాటు ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి, రాజీవ్ మీనన్ వంటి స్టార్స్ కూడా నటించారు. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేయొచ్చో హెచ్చరించే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

24
పేట్రియాట్‌ మూవీ స్టోరీ

ఈ సినిమాలో మమ్ముట్టి డాక్టర్ డేనియల్ జేమ్స్ పాత్రలో కనిపిస్తారు. ఆయన కేంద్ర ప్రభుత్వ మాజీ సైంటిఫిక్ అడ్వైజర్. ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. టెక్నాలజీని తప్పుగా వాడటాన్ని అడ్డుకోవాలని చూస్తారు. కానీ దేశానికి ఎన్నో కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన ఆయన, ఒకానొక టైంలో దేశానికి అక్కర్లేని వ్యక్తిగా మారతారు. అధికార వర్గాలు తనకు వ్యతిరేకంగా మారినప్పుడు, ఆయన తప్పించుకోవడమే కాదు.. తన మనస్సాక్షికి నచ్చిన కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేయాలనుకుంటారు. ఇదే 'పేట్రియాట్' సినిమా కథ.

34
మోహన్‌ లాల్‌ పాత్ర సర్‌ప్రైజ్‌

ఈ సినిమాలో మమ్ముట్టి తన రియాలిటికి దగ్గరైన అద్భుతమైన పాత్రలో కనిపించారు. ఢిల్లీలోని ఓ ఉన్నతాధికారిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మోహన్‌లాల్ పాత్రలో కూడా కొన్ని కొత్త విషయాలు ఉన్నాయి. అభిమానులు విజిల్స్ వేసే మూమెంట్స్ తక్కువే అయినా, సినిమాలో అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. నయనతార కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

44
ధనుష్‌ కి ఝలక్‌ ఇచ్చిన నయనతార

థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న 'పేట్రియాట్' సినిమా రిలీజైన మొదటి రోజే కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.29 కోట్లు వసూలు చేసింది. ఒక్క కేరళలోనే రూ.8 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో ఇదే అతిపెద్ద ఓపెనింగ్. దీనికి పోటీగా రిలీజైన ధనుష్ 'కర' సినిమా రెండు రోజులైనా ఇంకా రూ.20 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. కానీ 'పేట్రియాట్' మొదటి రోజే రూ.29 కోట్లకు పైగా వసూలు చేసి భారీ ఓపెనింగ్ సాధించింది. మొత్తంగా నయనతార.. ధనుష్‌కి పెద్ద ఝలక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories