Lady Superstar: 50 కోట్ల ప్రైవేట్ జెట్, 200 కోట్ల పైగా ఆస్తి, CA అవ్వాలనుకుని.. హీరోయిన్ అయిన బ్యూటీ ఎవరు?

Published : May 28, 2026, 02:44 PM IST

చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్న ఓ అమ్మాయి, ఈరోజు ఇండియన్ సినిమాలోనే ఓ పెద్ద బ్రాండ్‌గా ఎదిగింది. ఆమె ప్రయాణం ఓ సినిమా కథలాగే ఉంటుంది. ఎన్నో వివాదాలు, ఓటముల మధ్య కూడా ఆమె నిలబడిన తీరు ఎందరికో స్ఫూర్తి. ఇంతకీ ఎవరా లేడీ సూపర్ స్టార్.? 

PREV
16
స్టార్ హీరోలకు పోటీ ఇచ్చిన హీరోయిన్..

సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలదే రాజ్యం. వందల కోట్ల రెమ్యూనరేషన్, ఖరీదైన బంగ్లాలు, ప్రైవేట్ జెట్‌లు... ఇవన్నీ స్టార్ హీరోలకే సొంతం అనుకుంటాం. కానీ, ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ, హీరోలతో సమానంగా తనకంటూ ఓ సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్న ఏకైక 'లేడీ సూపర్ స్టార్' నయనతార.

26
చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వబోయి..

నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. కాలేజీ రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అవ్వాలని కలలు కంది. లెక్కల పుస్తకాలు పట్టుకోవాల్సిన ఆమె, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలనే మార్చేసింది. 2003లో మలయాళ చిత్రం 'మనస్సినక్కరే'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు, ఆమె లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు.

36
రెమ్యూనరేషన్‌లో హీరోలకే పోటీ

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోల ఆధిపత్యానికి సవాల్ విసిరింది. ఈ రోజుల్లో ఒక్కో సినిమాకి ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా 12 నుంచి 15 కోట్ల రూపాయలు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే ఏకైక నటి నయనే అంటారు.

46
సొంత ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలు ప్రైవేట్ జెట్‌లలో తిరగడం మనం చూశాం. కానీ, సొంతంగా ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ గా నయనతార రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 50 కోట్ల విలువైన ఈ జెట్‌లో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి సినిమా షూటింగ్‌లకు, వెకేషన్‌లకు వెళ్తుంటుంది. ఇది కేవలం విలాసవంతమైన జీవితం మాత్రమే కాదు, ఒక మహిళ తన కష్టంతో ఎంత ఎత్తుకైనా ఎదగగలదనడానికి నిదర్శనం.

56
బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు..

నయనతార కేవలం నటి మాత్రమే కాదు, తెలివైన వ్యాపారవేత్త కూడా. సినిమాలు, వ్యాపారాలతో నయన్ 200 కోట్లకుపైగా ఆస్తిని సంపాదించినట్టు సమాచారం. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి 'రౌడీ పిక్చర్స్' బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మిస్తోంది. దీనితో పాటు ఓ స్కిన్ కేర్ బ్రాండ్, కాస్మెటిక్స్ బిజినెస్‌లో కూడా పెట్టుబడులు పెట్టింది. చెన్నై, హైదరాబాద్, ముంబైలలో కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. ఆమె గ్యారేజీలో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి కార్లు ఆమె గ్యారేజ్ లో ఉన్నాయి.

66
'జవాన్'తో బాలీవుడ్‌ను షేక్ చేసి

సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన ప్రభావం చూపించింది నయనతార. రీసెంట్ గా షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటింది. పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ జోడీగా.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. మొత్తానికి, CA అవ్వాలనుకున్న ఓ అమ్మాయి ఈరోజు ఇండియన్ సినిమాలోనే ఓ పెద్ద బ్రాండ్‌గా ఎదగడం నిజంగా ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా కథే.

Read more Photos on
click me!

Recommended Stories