Blast Zone Movie Review: బ్లాస్ట్ జోన్‌ మూవీ రివ్యూ.. అర్జున్‌ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్‌ మూవీ ఎలా ఉందంటే?

Published : May 28, 2026, 02:08 PM IST

అర్జున్‌ చాలా రోజుల తర్వాత యాక్షన్‌ మూవీ చేశారు. `బ్లాస్ట్` పేరుతో రూపొందిన ఈ చిత్రంలో అభిరామి, ప్రీతి ముకుందర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? 

PREV
16
బ్లాస్ట్ జోన్‌ మూవీ రివ్యూ

యాక్షన్‌ స్టార్‌ అర్జున్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `బ్లాస్ట్ జోన్‌`. సుభాస్‌ కే రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిరామి, ప్రీతి ముకుందన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎజీఎస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ నిర్మించింది. కల్పతి ఎస్‌ అఘోరం, కల్పతి ఎస్‌ గణేష్‌, కల్పతి ఎస్‌ సురేష్‌ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ మూవీని తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేస్తున్నారు. నేడు గురువారం(మే 28)న విడుదలైంది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
బ్లాస్ట్ జోన్‌ మూవీ కథ

రాజారామ్‌ (అర్జున్‌ సర్జా) కరాటేలో ఛాంపియన్‌. కరాటే మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఒక ఇనిస్టిట్యూట్‌ నడిపిస్తుంటాడు. వీరికి ఒక మెడికల్‌ షాప్‌ కూడా ఉంటుంది. తన భార్య నీలవేణి(అభిరామి) కూడా కరాటేలో ఛాంపియన్‌. దీంతో కూతురు నీలా(ప్రీతి ముకుందన్‌)ని కూడా కరాటే ఛాంపియన్‌గా తయారు చేస్తారు. వీరి బాబాయ్‌(వివేక్‌ ప్రసన్న మెడికల్‌ షాప్‌ని చూసుకుంటాడు. చిన్నప్పుడు నీలాకి మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ఎదురించాలని, పోరాడాలని చెబుతాడు రాజారాం. దీంతో నీలా అందరితో గొడవలు పెట్టుకుంటుంది. ఓ పేద మహిళ కోసం పెద్ద రౌడీ షీటర్‌ని కొడుతుంది. మరోవైపు ఏడువేల కోట్ల మైనింగ్‌ కోసం స్థానిక ఎమ్మెల్యే పెద్ద బిగ్‌ షాట్‌ వరుణ్‌(జాన్‌ కొక్కేన్‌)తో డీల్‌ కుదుర్చుకుంటాడు. దీనికిగానూ ఎమ్మెల్యే ట్రస్ట్ కి వరుణ్‌ నుంచి వెయ్యి కోట్లు వైట్‌లో పంపించాల్సి ఉంటుంది. దీనికి వంద రూపాయల నోట్‌ కీలకంగా మారుతుంది. ఇది అండర్‌వరల్డ్ డాగ్‌ అబ్రహం(అర్జున్‌ చిదంబరం)కి అప్పగిస్తాడు. అబ్రహం ఒక యాక్సిడెంట్‌ వల్ల పోలీసులకు కంట్రోల్‌లో ఉంటాడు. కానీ అతను క్రిమినల్‌ అనే విషయం తెలియదు. కానీ తనని తీసుకెళ్లడానికి రౌడీలు రావడంతో పోలీస్‌లకు అనుమానం వస్తుంది. అతని చుట్టూ పోలీసుల పహారా పెట్టగా తప్పించుకొని పారిపోతాడు. ఈ క్రమంలో ఆయనకు గాయమవుతుంది. మరి ఈ గొడవలకు, రాజారాం ఫ్యామిలీకి సంబంధం ఏంటి? వెయ్యి కోట్ల డీల్‌కి సంబంధించిన వంద రూపాయల నోట్‌ వీరి వద్దకు ఎలా వచ్చింది? అత్యంత పవర్‌ఫుల్‌ విలన్‌ అయిన అబ్రహం.. రాజారాంకి ఎందుకు దొరికిపోయాడు? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన సినిమా.

36
బ్లాస్ట్ జోన్‌ మూవీ విశ్లేషణ

అర్జున్‌ సర్జా యాక్షన్‌ సినిమాలు చేసి చాలా రోజులు అవుతుంది. ఆయన క్యారెక్టర్స్, విలన్‌గా చేస్తూ రాణిస్తున్నారు. ఈ క్రమంలో `బ్లాస్ట్ జోన్‌`తో మరోసారి హీరోగా తన ప్రయత్నం చేశారు. అయితే అదిరిపోయే యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీతో హీరోగా కమ్‌ బ్యాక్‌ కావడం విశేషం. ఈ మూవీ కొంత `విక్రమ్‌` టచ్‌తో సాగుతుంది. సినిమా ప్రారంభంలో అర్జున్‌ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్‌ చేయడానికి చాలా టైమ్‌ తీసుకున్నారు. అదే సమయంలో దానికి పారలల్‌గా రౌడీలు ఏడువేల కోట్లకి సంబంధించిన డీల్‌ సెట్‌ చేయడం వంటి సీన్లని చూపించారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపించిన తీరు బాగున్నా, కొంత స్లో ఫీలింగ్‌ కలుగుతుంది. కథ స్టార్ట్ కావడానికి టైమ్‌ పట్టడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఓ పేద మహిళ విషయంలో హీరోయిన్‌ చేసే యాక్షన్‌తో సినిమా ఊపందుకుంది. సీరియస్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక అర్జున్‌, అభిరామి, ప్రీతి మధ్య ఇంట్లో వచ్చే సీన్లు కొంత రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రీతి బయట గొడవలు ఇంటి వద్దకు తేవడంతో అమ్మ ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతుంది. కానీ అర్జున్‌ తన కూతురుకి సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో రొటీన్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. మెడికల్‌ షాప్‌ గొడవ నుంచి అసలు కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత కథ స్పీడందుకుంటుంది. అయితే అది పోలీసులకు, అటు రౌడీలకు సస్పెన్స్ గా సాగడం, ఇటు హీరో ఫ్యామిలీ యాక్షన్‌తో రెచ్చిపోవడం క్రేజీగా ఉంటుంది. ఇంటర్వెల్‌ యాక్షన్‌ వాహ్‌ అనిపిస్తుంది. 

సెకండాఫ్‌ లో అర్జున్‌ ఫ్యామిలీ పూర్తిగా రౌడీలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. కానీ ఇందులోనూ మరీ డిటెయిలింగ్‌కి వెల్లడంతో మధ్య మధ్యలో రొటీన్‌గా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ లతో కూడిన యాక్షన్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. క్లైమాక్స్ కూడా అదిరిపోయేలా ఉంది. టైట్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమాని నడిపించిన తీరు, అటు పోలీసులు, ఇటు రాజారాం ఫ్యామిలీ, మరోవైపు విలన్లకి సంబంధించిన సన్నివేశాలను ముడిపెట్టిన తీరు, చివరికి వాటిని ముగించిన తీరు మాత్రం అదిరిపోయింది. ఈ మూవీ యాక్షన్‌తోపాటు స్క్రీన్‌ ప్లేతో మ్యాజిక్‌ చేస్తుందని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని లాజిక్‌ లెస్‌ సీన్లు ఉన్నాయి. హీరోకి సంబంధించిన సీన్లు ఈజీగా జరగడం సహజత్వానికి దూరంగా ఉన్నాయి. పోలీసుల వ్యవహరించే తీరు కూడా సహజంగా లేదు. విలన్లని బలంగా చూపించినా, చివర్లో తేలిపోయినట్టుగా చూపించడం మైనస్‌గా చెప్పొచ్చు. చాలా సీన్లని బాగా లాగినట్టుగా అనిపిస్తాయి. సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. యాక్షన్‌కి ఇచ్చిన ప్రయారిటీ ఎమోషన్స్ ఇవ్వలేదు. అదికొంత కొరతగా చెప్పొచ్చు.

46
బ్లాస్ట్ జోన్‌ మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?

రాజారాంగా అర్జున్‌ సర్జా ఇరగదీశారు. స్టార్‌ ఇమేజ్‌ వైపు వెళ్లకుండా చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించారు. ట్విస్ట్ లతో అదరగొట్టారు. యాక్షన్‌లో మరోసారి తానేంటో చూపించారు. ఫ్యామిలీని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. ఇక ఆయన భార్య నీలవేణిగా అభిరామి కూడా అదరగొట్టింది. ఓ వైపు అమ్మగా బాధపడుతూనే ఫ్యామిలీ ప్రమాదంలో ఉందన్నప్పుడు తను విశ్వరూపం చూపించిన తీరు బాగుంది. ట్విస్ట్ మాత్రం బాగుంది. ఆమె యాక్షన్‌ తోనూ దుమ్ములేపింది. నీలాగా ప్రీతి ముకుందన్‌ సైతం బాగా చేసింది. అందంగా కనిపిస్తూనే ఫైట్‌ సీన్లలో రచ్చ చేసింది. సర్‌ప్రైజ్‌ చేసింది. అర్జున్‌తో కలిసి చేసే యాక్షన్‌ సీన్లలో మెప్పించింది ప్రీతి. కాకపోతే అంత అందంగా, సుకుమారంగా కనిపించే ఆమె ఇలా యాక్షన్‌ చేయడం కొంత కన్విన్సింగ్‌గా అనిపించదు. వివేక్‌ పాత్రలోని ట్విస్ట్ కూడా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వరుణ్‌గా జాన్‌ కొక్కేన్‌, అబ్రహాంగా అర్జున్‌ చిదంబరం, కిరుబకరన్‌గా పవన్‌ కృష్ణ వంటి వారు పాత్రల పరిధి మేరకు మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

56
బ్లాస్ట్ జోన్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే

సినిమాలో హైలైట్‌ ఏంటంటే రవి బన్సూర్‌ మ్యూజిక్‌. ఆయన బిజీఎంతో దుమ్ములేపారు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి పాత్రకి ఎలివేషన్లు ఇచ్చారు. అవి కొంత ఓవర్‌గా అనిపించినా, కన్విన్సింగ్‌గానే ఉన్నాయి. అరుణ్‌ రాధాకృష్ణన్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత వర్క్ చేయాల్సింది. ట్రిమ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు సుభాష్‌ కె రాజ్‌ రెగ్యూలర్‌ స్టోరీని తనదైన స్టయిల్‌లో, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మలిచి తెరకెక్కించడం విశేషం. విక్రమ్‌ మూవీ తరహాలో, లోకేష్‌ కనగరాజ్‌ స్క్రీన్‌ ప్లే తరహాలో మూవీని రూపొందించారు. కానీ ఆకట్టుకునేలా చేశారు. స్క్రీన్‌ ప్లే పరంగా మ్యాజిక్‌ చేశాడని చెప్పొచ్చు.

66
ఫైనల్‌గా

 `బ్లాస్ట్ జోన్‌` యాక్షన్‌ మూవీస్‌ ని ఇష్టపడే వారికి మంచి ట్రీట్‌ అని చెప్పొచ్చు.

రేటింగ్‌: 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories