10 లక్షల హ్యాండ్ బ్యాగ్ తో పాటు.. నయనతార కళ్లు చెదిరే కాస్ట్లీ కలెక్షన్స్ ఏంటో తెలుసా?

Published : Nov 19, 2025, 04:57 PM IST

నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డు సాధించింది.  ఎక్కువగా సంపాధిస్తోంది కాబట్టి.. ఆమె వాడే వస్తువులు కూడా అంతే కాస్ట్లీగా ఉంటాయి.  నయనతార కలెక్షన్స్ లో కాస్ట్లీవి ఏవంటే? 

PREV
18
లగ్జరీని ఇష్టపడే నయనతార

సౌత్ ఇండియా సినిమాల్లో 'లేడీ సూపర్ స్టార్'గా వెలుగు వెలుగుతోంది నయనతార.  తన నటనతో పాటు జీవనశైలితో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. చూడటానికి సింపుల్‌గా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో లగ్జరీని ఎక్కువగా ఇష్టపడుతుంది నయన్.

28
3నగరాల్లో కోట్లు విలువ చేసే ఇళ్లు

నయనతారకు చెన్నై, హైదరాబాద్, కేరళలో కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి. పని వల్ల సొంత ఊరి కన్నా చెన్నై, హైదరాబాద్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంది స్టార్ హీరోయిన్. అందుకే అక్కడ హై-ఎండ్ అపార్ట్‌మెంట్లు, విల్లాలు కొన్నది.

38
100 కోట్ల పోయెస్ గార్డెన్ ఇల్లు:

చెన్నైలోని పోయెస్ గార్డెన్, ఆళ్వార్‌పేట్ లాంటి ప్రాంతాల్లో ఆమెకు ఇళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రముఖులు నివసించే  పోయెస్ గార్డెన్ ఇంటి విలువ 100 కోట్లు ఉంటుందని అంచన. ఇక ఈ హౌస్ లో  ఇంటీరియర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. కేరళలో కొన్న విల్లా, ప్రకృతి మధ్య ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు.

48
నయనతార కార్ల కలెక్షన్..

నయనతార వాడే కార్లు చాలావరకు లగ్జరీవే. BMW 7 సిరీస్, మెర్సిడెస్-బెంజ్ GLS, ఆడి Q7 లాంటి హై-ఎండ్ కార్ల నయన్ను గ్యారేజ్ లో ఉన్నాయి. కొన్నిసార్లు రేంజ్ రోవర్ లేదా స్పోర్ట్స్ కార్లలో నయనతార  ప్రయాణిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

58
నగలంటే లేడీ సూపర్ స్టార్ కు ఎంతో ఇష్టం

నయనతారకు నగలంటే చాలా ఇష్టం. డైమండ్, ప్లాటినం, గోల్డ్‌లో చాలా వెరైటీ కలెక్షన్లు ఆమె దగ్గర ఉన్నాయి. రెడ్ కార్పెట్ ఈవెంట్స్, ఫోటోషూట్లలో ఆమె ధరించే నగలు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. పెళ్లిలో ఆమె ధరించిన నగలు చాలా రోజులు చర్చనీయాంశమయ్యాయి.

68
ప్రపంచ స్థాయి బ్రాండ్స్ వాడుతుంది

నయనతార ఫ్యాషన్ ఎంపికలు కూడా హై-ఎండ్‌లోనే ఉంటాయి. గూచీ, డియోర్, లూయిస్ విట్టన్ లాంటి బ్రాండ్ల హ్యాండ్‌బ్యాగ్‌లు, దుస్తులు వాడుతుంది. కొన్ని బ్యాగుల ధర 3 లక్షల నుంచి 10 లక్షల పైనే ఉంటుందని అంచనా.

78
నయన్ ఇంట్లో హై-టెక్ పరికరాలు

నయనతార  ఇంట్లో వాడే టెక్ గాడ్జెట్స్ కూడా హై-క్వాలిటీవే. ఐఫోన్ ప్రో మాక్స్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ మ్యాక్‌బుక్ లాంటివి ఆమె దగ్గర ఉండటం కామన్. ఇంటి ఇంటీరియర్ స్మార్ట్ హోమ్ ఫీచర్లతో ఉంటుందని అంటారు.

88
రౌడీ పిక్చర్స్ తో నిర్మాతగా..

అలాగే, రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ కోట్ల రూపాయల ప్రాజెక్టులలో పెట్టుబడి పెడుతున్నారు. సినిమాలు నిర్మిస్తూనే.. దుబయ్ లో నయనతార సోదరుడి కంపెనీలలో ఆమె పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా కోట్లలో సంపాదిస్తూ.. లగ్జరీ లైఫ్ ను ఆమె లీడ్ చేస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories