ఇటీవలే నయనతార - విఘ్నేశ్ శివన్ ల వివాహం జరిగింది. వాళ్లు హనీమూన్ కి వెళుతున్నారనీ, నయన్ కొన్ని రోజుల వరకూ షూటింగులకు హాజరు కాకపోవచ్చని అనుకున్నారు. అంతే కాదు ఇక సినిమాలకు కూడా బ్రేక్ ఇస్తుందని, ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌కు కూడా నయన్ కొత్త కండిషన్స్ పెడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా ఆమె జవాన్ షూటింగ్‌లో పాల్గొనడం వార్తల్లో నిలిచింది. ఇక తెలుగులో ఆమె గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.