Dhanush vs Vignesh: ధనుష్‌ తిన్న తర్వాతే తినేవాడిని, కానీ.. స్టార్‌ హీరోతో గొడవపై నయనతార భర్త ఎమోషనల్‌ కామెంట్‌

Published : Apr 06, 2026, 03:18 PM IST

Dhanush vs Vignesh: నటుడు ధనుష్‌తో తనకున్న విభేదాలపై నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తొలిసారిగా స్పందించారు. తమ మధ్య గొడవకు అసలు కారణం ఏంటో చెబుతూ ఎమోషనల్ అయ్యారు.  

PREV
13
ధనుష్‌తో గొడవ.. అసలు కారణం చెప్పిన విఘ్నేష్
విఘ్నేష్ శివన్, ధనుష్ మధ్య గొడవ 2024లోనే మొదలైంది. విఘ్నేష్ డైరెక్ట్ చేసిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమాను ధనుష్ నిర్మించారు. ఈ సినిమాలోని 3 సెకన్ల క్లిప్‌ను నయనతార పెళ్లి డాక్యుమెంటరీ 'Nayanthara: Beyond the Fairytale'లో వాడినందుకు, ధనుష్ రూ.10 కోట్లకు లీగల్ నోటీస్ పంపారు. ఇది నయన్, విఘ్నేష్‌లకు పెద్ద షాక్ ఇచ్చింది.
23
ధనుష్‌లో మా నాన్నని చూసుకుంటాను
ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తన కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIC) పనుల్లో ఉన్నారు. ఇటీవల గోపీనాథ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్‌తో ఉన్న బంధం గురించి మాట్లాడారు. 'నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం. ఒక నటుడిగానే కాదు, వ్యక్తిగా ఆయన్ని ఉన్నత స్థానంలో చూస్తాను. జులై 28న ధనుష్ పుట్టినరోజు. అదే రోజు మా నాన్న చనిపోయారు. అందుకే ధనుష్‌లో మా నాన్నను చూసుకుంటాను. కానీ కొన్నిసార్లు ఎందుకు గొడవలు వస్తాయో అర్థం కాదు' అని అన్నారు.
33
ధనుష్‌తో స్నేహం తెగడం పెద్ద నష్టం

'ధనుష్‌తో స్నేహం తెగిపోవడం నా జీవితంలో పెద్ద నష్టంగా, అవమానంగా భావిస్తున్నాను. ఎక్కడో నేను తప్పు చేశాననిపిస్తోంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ధనుషే. 'వేలైఇల్లా పట్టధారి' సినిమా షూటింగ్ టైంలో రెండేళ్లకు పైగా ఆయనతోనే ఉన్నాను. ఆయన తింటేనే నేను తినేవాడిని. మా మధ్య అలాంటి బంధం ఉండేది' అని విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories