Leader Box Office: లెజెండ్ శరవణన్ హీరోగా దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'లీడర్' సినిమా థియేటర్లలో రచ్చ చేస్తోంది. భారీ వసూళ్లని రాబడుతోంది. మరి ఈ చిత్రం మూడు రోజుల్లో ఎంత చేసిందంటే?
తమిళనాడులో పెద్ద బిజినెస్‌మ్యాన్ లెజెండ్ శరవణన్. ఆయన వ్యాపారవేత్తగా కంటే ఇప్పుడు హీరోగా బాగా పాపులర్ అయ్యారు. మొదట్లో తన షాప్ యాడ్స్‌లో స్టార్ హీరోయిన్లతో కలిసి నటించి ట్రెండ్ సెట్టర్‌గా మారారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, 2022లో వచ్చిన 'ది లెజెండ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. జేడీ-జెర్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజైంది. ఆ సినిమాతో రచ్చ చేశారు.
25
శరవణన్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్
భారీ అంచనాలతో రిలీజైన 'ది లెజెండ్' సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ, లెజెండ్ శరవణన్ వాటిని పట్టించుకోకుండా, ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో తన రెండో సినిమాను ఎంచుకున్నారు. బలమైన కథ, కథనాలతో `లీడర్` మూవీ చేశారు. శరవణన్‌కిది స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
35
టీజర్‌తోనే అంచనాలు పెంచిన శరవణన్
ఈ సినిమా కోసం సుందర్ సి సహా పలువురు టాప్ డైరెక్టర్లతో శరవణన్ చర్చలు జరిపారు. చివరికి దురై సెంథిల్‌కుమార్‌ను ఫైనల్ చేశారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో, ఆయన కూడా లెజెండ్ శరవణన్‌తో సినిమా తీయడానికి ఒప్పుకున్నారు. ఆయన కోసం ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేసి, తన స్టైల్‌లో `లీడర్` సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ రిలీజైనప్పుడే అంచనాలు పెరిగాయి. అందులో శరవణన్ యాక్షన్ సీన్స్ చూసి అభిమానులు షాక్ అయ్యారు.
'లీడర్' సినిమాలో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించింది. దురై సెంథిల్‌కుమార్ రూపొందించిన ఈ మూవీలో ఆండ్రియా, వీటీవీ గణేష్, శ్యామ్, అరంగంటి నిషా, మధురై ముత్తు వంటి భారీస్టార్ కాస్టింగ్ నటించింది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా ఉన్నా, ఇంటర్వెల్ నుంచి సినిమా టాప్ గేర్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌ను అదిరిపోయే ట్విస్టులతో నింపి, ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా లెజెండ్ శరవణన్‌కు పక్కా కంబ్యాక్ అని చెప్పొచ్చు.
55
లీడర్ మూవీ మూడు రోజుల కలెక్షన్లు
'లీడర్' సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో, చిత్ర యూనిట్ అఫీషియల్ కలెక్షన్ల వివరాలను ప్రకటించింది. వారి ప్రకారం, 'లీడర్' సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లు వసూలు చేసింది. ఈ నెలలో రిలీజైన తమిళ సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, అక్కడ కూడా కలెక్షన్లు పెరుగుతున్నాయి. శరవణన్ మూవీకి ఇంతటి స్థాయి వసూళ్లని ఎవరూ ఊహించలేదు. ఇదే జోరు కొనసాగితే ఇది వంద కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు.