ధనుష్-నయనతార మధ్య ముదురుతున్న వివాదం, ఏకిపారేసిన లేడీ సూపర్ స్టార్!

First Published | Nov 16, 2024, 7:20 PM IST

ధనుష్-నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా ధనుష్ తో గతంలో నటించిన పలువురు హీరోయిన్స్ నయనతారకు మద్దతుగా నిలుస్తున్నారు.

ధనుష్-నయనతార కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పది సంవత్సరాల నుంచి వీరి మధ్య గొడవలు ఉన్నాయని నయనతార లేఖ ద్వారా తెలుస్తుంది. 3 సెకన్ల వీడియో వాడినందుకు నయనతార మీద ధనుష్ రూ. 10 కోట్ల దావా వేశారు.

నానుమ్ రౌడీ ధాన్ సినిమా సమయంలో ధనుష్-నయనతార మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన ఉంది. ఆ సినిమా సమయంలో ఏదో పెద్ద వివాదం జరిగి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. నయనతారపై రూపొందించిన ''నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'' అనే డాక్యుమెంటరీ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సినిమా 3 సెకన్ల వీడియో ఉంది. ఈ సినిమాని ధనుష్ నిర్మించారు. అనుమతి లేకుండా వీడియో వాడినందుకు ధనుష్ కేసు వేశారు. 3 సెకన్ల ఫుటేజ్ కి రూ. 10 కోట్ల దావా వేయడం సంచలనంగా మారింది.

ధనుష్-నయనతార వివాదంపై పలువురు హీరోయిన్స్ స్పందించారు. శృతి హాసన్, అనుపమ, పార్వతి, నజ్రియా నయనతారకి మద్దతు ఇస్తున్నారు. ఈ వివాదంలో ధనుష్ అతి చేస్తున్నారు. నయనతారను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ హీరోయిన్స్ అందరూ గతంలో ధనుష్‌తో సినిమా చేసినవారే.
 


ధనుష్ ప్రవర్తనతో వీళ్లందరికీ కోపం వచ్చిందా?. వీరికి కూడా ధనుష్ అంటే గిట్టదా? లేక నయనతార బహిరంగంగా మాట్లాడినందుకు మద్దతు ఇస్తున్నారా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అసలు వివాదం ఏమిటంటే.. 2015లో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలో నయనతార నటించింది. విజయ్ సేతుపతి, పార్తీబన్ కీలక రోల్స్ చేశారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడీ దాన్ తెరకెక్కగా హీరో ధనుష్ నిర్మించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ సెట్స్ లోనే విగ్నేష్ శివన్, నయనతార ప్రేమలో పడ్డారు. 

2022లో నయనతార-విగ్నేష్ వివాహం చేసుకున్నారు. నయనతార మ్యారేజ్ ని డాక్యూమెంటరీ గా రూపొందించారు. ఈ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.  నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ఈ డాక్యూమెంటరీ నెట్ఫ్లిక్స్ లో నవంబర్ 18 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. అక్కడ వివాదం మొదలైంది. డాక్యూమెంటరీలో నానుమ్ రౌడీదాన్ మూవీకి సంబంధించిన 3 సెకన్ల ఫుటేజ్ వాడారు. 

నానుమ్ రౌడీదాన్ నిర్మాతగా ఉన్న ధనుష్ కాపీ రైట్స్ వైలేషన్ క్రింద నయనతారపై రూ.10 కోట్ల దావా వేశాడు. దీనిపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల లేఖ విడుదల చేసింది. తమపై పగతోనే ధనుష్ ఇలా చేస్తున్నాడు. దిగజారిపోయాడు. పైకి కనిపించేది ఒకటి ధనుష్ లోపల మరొకటి. నానుమ్ రౌడీదాన్ మూవీ సెట్స్ లో మా సొంత కెమెరాతో తీసుకున్న మూడు సెకన్ల ఫుటేజ్ పై దావా వేస్తావా.. అంటూ ఆమె సుదీర్ఘ సందేశంలో ధనుష్ ని ఏకి పారేసింది.. 

Latest Videos

click me!